Heart Attacks: శరీరంలో అతి ముఖ్యమైన కండరం గుండె. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి సమస్యలు వస్తాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ గుండె జబ్బులతో బాధపడుతున్న వారు మనదేశంలో ఉన్నారని తెలిసింది.
మనదేశంలో అకాల మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కలిగే గుండె జబ్బులలో 60 శాతం మన దేశంలోనే సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గణాంకాలు గుండె వ్యాధి బారిన పడకముందే దానిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా మూడు వ్యాయామాలు చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
24
ఏరోబిక్ వ్యాయామాలు
ఈ వ్యాయామాన్ని కార్డియో అని కూడా పిలుస్తారు. ఇది స్టామినా అందించేందుకు ఉపయోగపడుతుంది. ఏరోబిక్ వ్యాయామాలు చేసేటప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే శరీరానికి చెమట పడుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. ఏరోబిక్ వ్యాయామం అంటే నడక, ఈత, జాగింగ్ వంటివి. అలాగే బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ వంటివి కూడా ఆడవచ్చు.
34
స్ట్రెంత్ వ్యాయామాలు
రోగనిరోధక సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు ఇవి. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. ఏరోబిక్ వ్యాయామంతో పాటు వీటిని కలిపి చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, అయితే దీనిని ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
స్ట్రెచింగ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచివే. ఇవి నేరుగా గుండెకు సపోర్టు ఇవ్వకపోవచ్చు... కానీ వ్యాయామం చేసేటప్పుడు వచ్చే కండరాల తిమ్మిరి, కీళ్ల నొప్పులు, కండరాల ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా వ్యాయామాలు చేసే ముందు నేరుగా తీవ్రంగా మొదలుపెట్టకండి. ముందుగా నెమ్మదిగా మొదలు పెట్టండి. ఆ తర్వాతే తీవ్రతను పెంచండి. వ్యాయామం తర్వాత హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత రెండూ పెరుగుతాయి. వ్యాయామం మెల్లగా తగ్గించాలి. అకస్మాత్తుగా ఆపితే తల తిరిగినట్టు అనిపించవచ్చు.