High cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైనదే. కానీ అది అధికంగా శరీరంలో పేరుకుపోతే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీర కణాల నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన కొలెస్ట్రాల్ అధికంగా శరీరంలో చేరడనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
కొలెస్ట్రాల్ మనకు అవసరమైనదే. అది శరీర కణాల నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన కొవ్వు పదార్థం. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరితే మాత్రం సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా "చెడు" (LDL) కొలెస్ట్రాల్, ధమనులలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
26
ఈ అలవాట్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 4.4 మిలియన్ల మంది అనేక అనారోగ్యాల వల్ల మరణిస్తున్నారు. కొన్ని రోజువారీ అలవాట్లు శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది.
36
నూనె వాడకం
ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మంచివే కానీ నూనెతో నిండిన ఆహారాలు అధికంగా తింటే మాత్రం మంచిది కాదు. నూనెలో వేయించిన పదార్థాలు తక్కువగా తినాలి. నూనె వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించాలి. నూనె ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యం. నూనె అధికంగా వాడితే అధిక కేలరీలు చేరి LDL కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
వేయించిన, కరకరలాడే స్నాక్స్ తినేందుకు రుచిగా ఉంటాయి. కానీ అవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరడానికి కారణం అవుతాయి. ఆ స్నాక్స్ వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయి. ఇవి గుండె జబ్బులను పెంచేస్తాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల లిపిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
56
నెయ్యి మితంగా
ఇంట్లో నెయ్యి, వెన్న అధికంగా వాడుతూ ఉంటారు. అవి రుచిగా ఉంటాయి. కానీ అతిగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ గా మారిపోతాయి. కాబట్టి నెయ్యి, బటర్ వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.
66
వీటిని తినండి
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కరిగే ఫైబర్ రక్తంలోకి చెడు కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుందని మాయో క్లినిక్ చెబుతోంది. రోజూ 10 గ్రాముల ఫైబర్ తినడం వల్ల గుండె జబ్బుల మరణ ప్రమాదం 17 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక ఉప్పు వాడకం రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక చక్కెర ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. బ్రెడ్, సాస్‌లలో ప్రమాదకరమైన చక్కెర ఉంటుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెబుతోంది.