Showering Mistakes : స్నానం చేసేటప్పుడు చేసే ఈ తప్పులే మీ చర్మాన్ని పాడుచేస్తాయి..

First Published Jan 20, 2022, 5:11 PM IST

Showering Mistakes : వెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటే వచ్చే ఆ అనుభూతే వేరబ్బా. అందుకే సమయాన్ని మరచిపోయి స్నానాన్ని ఆస్వాధిస్తుంటారు చాలా మంది. కానీ స్నానం చేసేటప్పుడు చేసే ఆ మిటస్టేక్స్ వల్లే మీ చర్మం పాడవుతుందని మీకు తెలుసా..

Showering Mistakes : చలి కాలంలో వెచ్చటి నీళ్లతో స్నానం చేస్తుంటే ఇంకొంచెం సేపు ఆ నీళ్లలో ఉంటే బాగుండు అని అనిపిస్తుండటం చాలా సహజం. అందుకే చాలా మంది సమయాన్ని సైతం మర్చిపోయి జలకాలు ఆడుతుంటారు. అదే మీరు చేసే అతిపెద్ద మిస్టేక్. స్నానం చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మీ చర్మం పాడవడం పక్కాగా జరుగుతుంది. అదేంటి స్నానం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా అని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే మీ చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు ఎంతో ముఖ్యం కాబట్టి.  మరి హెడ్ బాత్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

చలికాలం వేడి నీళ్ల స్నానం హాయినిస్తుందని ఎక్కువ సేపు స్నానం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ వేడి నీటి స్నానం ఎంత హాయినిచ్చినా.. ఎంత ప్రశాంతంగా అనిపించినా.. ఎక్కువ సేపు స్నానం చేయడం మంచిది కాదు. ఎక్కువ సేపు మీ శరీరం నీళ్లలో ఉండటం వల్ల చర్మానికి హాని జరుగుతుంది. తద్వారా మీ స్కిన్ పొడిబారుతుంది. తరచుగా మీ స్కిన్ పొడిబారుతుంటే మీరు స్నానం చేసే సమయాన్ని తగ్గించడం మంచిది. అంటే ఐదు నుంచి పది నిమిషాలు తగ్గిస్తే చర్మం పొడిబారే సమస్యే రాదు. 
 

చర్మం జిడ్డుగా అయినా కాకపోయినా చాలా మంది రోజుకు రెండు నుంచి మూడు సార్లు స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రోజులో వెంట వెంటనే స్నానం చేయడం చర్మానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల స్కిన్ పొడిబారుతుంది. దాంతో పాటుగా చర్మంపై దురద వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా చర్మంపై ఉంటే రక్షణ వ్యవస్థ కూడా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజులో ఎక్కువ సార్లు స్నానం చేసే అలవాటుంటే వెంటనే మానుకోండి. అవసరమనుకుంటే చేతులను , కాళ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. 
 

చాలా మంది కేవలం మార్నింగ్ టైం లోనే స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకే మార్నింగ్ మాత్రమే స్నానం చేస్తుంటారు. అయితే నిద్రపోవడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు స్నానం చేయడం మంచిదని స్లీవ్ మెడిసిన్ రివ్యూస్ అధ్యయనం తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్ల రాత్రి నిద్ర ప్రశాంతంగా, తొందరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

వాతావరణం చల్లగా ఉందని మరీ వెచ్చటి నీళ్లతో కూడా స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే నాచురల్ ఆయిల్స్, లిపిడ్స్ తగ్గుముఖం పడతాయి. తద్వారా స్కిన్ పొడిబారడమే కాకుండా, దురద సమస్య కూడా రావొచ్చు. అందుకే ఎక్కువ వేడిగా ఉండే నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం ఉత్తమం. 

చర్మం నిగనిగ మెరిసిపోయేందుకు ఏవేవో క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. అయితే ఏవి పడితే అవి చర్మానికి రాయడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కెమికల్స్ ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. అవే యాంటీ బ్యాక్టిరియా నుంచి రక్షణ కల్పిస్తాయని వాటినే వాడటం చాలా ప్రమాదకరం. సాధారణ సబ్బులు కూడా యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగుండటంతో వాటితే యూజ్ చేయడం మంచిది. 
 

click me!