Benefits Of Kissing : ముద్దుతో ఇన్ని ఉపయోగాలున్నాయా?

First Published Jan 20, 2022, 4:39 PM IST

Benefits Of Kissing : ఒక్క ముద్దుతో మెరిసిపోయే చర్మం మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఉదయాన్నే కిస్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయట. అవేంటో తెలుసా..

Benefits Of Kissing : ప్రేమతో ఇచ్చే ముద్దు.. ఎంతో అందమైనది.. ఇష్టమైనది. ప్రియమైన వారు చెంతనుంటే ముద్దు పెట్టుకోవాలని ఏ వ్యక్తికుండదు చెప్పండి. అందులోనూ ప్రేమికులకు, భాగస్వాములకు ఈ ముద్దంటే మహా ముద్దు. అవకాశం ఉంటే చాలు ఒక చిన్ని ముద్దుతో తమ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి సిద్దమైపోతుంటారు. అందులోనూ ఒక చిన్న ముద్దు ఇద్దరి భాగస్వాముల మధ్యనున్న ఎలాంటి దూరాన్నైనా ఇట్టే కరిగించేస్తుంది. తమ భాగస్వాములపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడానికి కూడా ముద్దునే ఉపయోగిస్తుంటారు. ముద్దు ఇష్టాన్ని వ్యక్తపరచడమే కాదు.. మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ముద్దు పెట్టుకోవడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయట. ఉదయం పూట ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా Benefits ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

నిగనిగలాడే చర్మం:  కిస్ చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా, నిగనిగలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు పెట్టుకుంటే మీ చర్మంలో లవ్ హార్మోన్ అమాంతం  పెరిగి.. చర్మం నిగనిగా, కాంతివంతంగా చేసేలా ప్రేరేపిస్తుందట. అంటే ముద్దు పెట్టుకోవడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ అమాంతం పెరుగుతుందట. ఈ హార్మోన్ యాంటి ఆక్సిడెంట్ గా మారిపోయి మీ చర్మ కణాలను ఉత్తేజితం చేస్తుంది. దాంతో స్కిన్ నిగనిగా మెరిసిపోతుంది. 

ముద్దుతో ఇష్టం వ్యక్తపరచడమే కాదు.. ఒక ముద్దుతో ముఖంపై ఉండే 34 కండరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల ముఖంలో గ్లో వస్తుంది. అలాగే కిస్ చేసే సమయంలో ఈ 34 కండరాలు ఏకంగా 110 కంటే ఎక్కువ  Angles లో పనిచేస్తాయట. దాని వల్ల మీ ముఖ కండరాలు బలంగా మారతారట. ముఖ్యంగా ముఖంపై Blood circulation కూడా మెరుగ్గా జరిగి ముఖం మరింత కాంతివంతంగా మారుతుందట. 

ముద్దు పొడి చర్మానికి కూడా స్వస్తి చెబుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొడి చర్మానికి, యాంటీ ఏజింగ్ సమస్య రావడానికి ఒత్తిడే ప్రధాన కారణం, మీరు ప్రేమతో పెట్టే ముద్దు పొడి చర్మాన్ని దూరం చేస్తుందట. అంటే ముద్దు పెట్టుకున్నప్పుడు ఒత్తిడి దూరం అయ్యి ఈ చర్మ సమస్య దూరం అవుతుందట. అందుకే మీ భాగస్వామికి ముద్దు పెట్టడం వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి తన జీవితకాలం మొత్తంలో తక్కువలో తక్కువ 20,000 నిమిషాలకంటే ఎక్కువ సమయమే ముద్దు పెట్టుకోగలడని పరిశోధనలు పేర్కొంటున్నాయి. 
 

వయస్సు వారిగా వచ్చే ముడతల సమస్యను కూడా ముద్దు దూరం చేయగలదట. ముద్దు పెట్టుకుంటే మీ పెదవులు, ముఖం, నాలుక, దవడ, మెడ కండరాలకు వ్యాయామంలా మారుతుందట. దాంతో ముఖంపై ఉండే అన్ని Muscles పనిచేయడంతో ముఖానికి బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా జరుగుతుంది. తద్వారా ముఖంపై ముడుతలు వచ్చే అవకాశమే లేదట. అందులోనూ యాంటీ ఏజింగ్ సమస్య కూడా దరిచేరని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 

లాలాజం ఉత్పత్తితో దంతాల సమస్యలు రావు. కాగా ముద్దు పెట్టుకునే సమయంలో నోట్లో లాలాజలం పెరుగుతుందట. ఇలా చేయడం వల్ల పళ్లకు మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందులోనూ ముద్దు వల్ల దంత క్షయం కూడా రాదట. దంతాలకు రక్షణలా ముద్దు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

click me!