సంపదను, అదృష్టం కావాలంటే ఈ జంతువులు మీ ఇంట్లో ఉండాల్సిందే !

Published : Feb 28, 2025, 05:11 PM ISTUpdated : Feb 28, 2025, 07:17 PM IST

Animals that bring money luck: కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, నమ్మకాలల్లో కొన్ని జంతువులు అదృష్టాన్ని తీసుకువ‌స్తాయ‌ని భావిస్తారు. తాబేలు నుంచి కోయి చేప వ‌ర‌కు అదృష్టాన్ని, సంపదను తెస్తాయని నమ్మే 10 జంతువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
సంపదను, అదృష్టం కావాలంటే ఈ జంతువులు మీ ఇంట్లో ఉండాల్సిందే !
dog, rabbit, luck, Money,

కుందేలు

కొన్ని సంస్కృతులలో, కుందేళ్ళు అదృష్టానికి సంకేతం, సంతానోత్పత్తి, సంప‌ద‌ను క‌లిగిస్తాయ‌ని న‌మ్ముతారు. చైనీస్ రాశిచక్రంలో, కుందేలు సంవత్సరంలో జన్మించిన వ్యక్తులు ప్రశాంత జీవ‌నం, గొప్ప‌ అదృష్టవంతులుగా జీవిస్తార‌ని చెబుతారు. 

కుక్కలు

కుక్కలు మనిషికి ప్రాణ స్నేహితుడు. న‌మ్మ‌క‌మైన‌వి. అలాగే, అవి అదృష్టాన్ని తెస్తాయ‌ని న‌మ్ముతారు.

25
good luck animals

గుర్రం

గుర్రాల‌ను అదృష్టం తీసుకువ‌చ్చే జంతువులుగా, సానుకూలతకు సంకేతంగా భావిస్తారు. వాటి వేగం, బలం, స్వభావం జీవితంలో ముందుకు సాగడానికి సంకేతంగా న‌మ్ముతారు. వాస్తు, ఫెంగ్ షుయ్ సూత్రాల ప్రకారం గుర్రాలు అదృష్టాన్ని తెచ్చే జంతువులు. మీ ద‌గ్గ‌ర గుర్రాలు లేక‌పోయినా ఇళ్లలో 7 గుర్రాల పెయింటింగ్ ఉంచుకుంటే అదృష్టం క‌లుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. 

తాబేలు

భూమిపై ఎక్కువ కాలం జీవించే జంతువులలో తాబేలు ఒకటి. తాబేలు ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. తాబేలు బొమ్మలు అదృష్టాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని తెస్తాయని నమ్ముతారు. అందుకే ఇండ్ల‌లో తాబేలు లేదా వాటి చిత్రాల‌ను పెట్టుకుంటారు. 

35
Image: Getty

పిల్లులు

పిల్లులను అన్ని సంస్కృతులలో అదృష్టానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. వాటిని పవిత్రంగా చూసిన ఈజిప్షియన్లు కావచ్చు లేదా తమ వ్యాపారాలలో కదిలే చేతులు కలిగిన పిల్లి బొమ్మలను కలిగి ఉన్న దక్షిణాసియా సంస్కృతులు కావచ్చు. అందుకే చాలా మంది పిల్లుల‌ను పెంచుకుంటారు. లేదా వాటి బొమ్మ‌లు, ఫోటోల‌ను ఇండ్ల‌లో ఉంచుకుంటారు.

కోయి చేప 

చాలా కాలం జీవించే వాటిలో కోయి చేప ఒక‌టి. దీర్ఘాయుష్షు క‌లిగిన ఈ కోయి చేప అదృష్టం, శ్రేయస్సు, దీర్ఘాయువును ఇస్తుంద‌ని న‌మ్ముతారు. దక్షిణాసియాలో కోయి చేప సంప‌ద‌, విజ‌యాల‌ను అందిస్తుంద‌ని న‌మ్ముతారు. 

45
these are the 10 animals that bring good luck, money in telugu rma

హంస‌లు 

హంసలు ప్రేమ, స్వచ్ఛత, పరివర్తనకు చిహ్నంగా భావిస్తారు. అందుకే అనేక సంస్కృతులను వాటి సానుకూల శ‌క్త ప్ర‌భావితం చేసింది. అందుకే చాలా మంది ఇండ్ల‌లో హంస‌ల ఫొటోలు క‌నిపిస్తాయి.

ఏనుగు

అన్ని సంస్కృతులలో ఏనుగులను జ్ఞానం, రక్షణ, శ్రేయస్సుకు చిహ్నాలుగా భావిస్తారు. మ‌న‌కు ఎదుర‌య్యే అడ్డంకుల‌ను తొల‌గిస్తాయ‌ని న‌మ్ముతారు. అందుకే చాలా మంది ఇండ్ల‌లో ఎనుగుల బొమ్మ‌లు, ఫోటోల‌ను ఉంచుకుంటారు. 

55
10 animals that are believed to bring good luck

బల్లులు

ప్రజలు బల్లులను ఇష్టపడకపోయినా, కొన్ని పండుగలు, సందర్భాలలో వాటిని వెతుకుతారు. హిందువులు బ‌ల్లును పూజించే విష‌యం తెలిసిందే.

నెమలి

నెమళ్ళు కూడా అదృష్టం, సానుకూలత, అంద‌మైన జీవితాన్ని ఇస్తాయ‌ని న‌మ్ముతారు. వీటి ఈకలు ప్రతికూల శక్తి నుండి రక్షణకు, సంపద, కీర్తి ఆకర్షణకు చిహ్నంగా భావిస్తారు. అందుకే నెమ‌ళ్ల ఫోటోలు, ఈక‌లు చాలా మంది ఇండ్ల‌ల్లో క‌నిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories