ఈ రోజుల్లో బిజీ లైఫ్, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారు. ఈ సమస్యని ఎదుర్కోవడానికి యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. అంతేకాదు... రెగ్యులర్ గా తినడం మానేస్తూ ఉంటారు. కానీ.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గడం కాదు.. బరువు పెరుగుతారు. అలా కాకుండా.. కొన్ని రకాల ఫుడ్స్ ని మీరు డైట్ లో భాగం చేసుకుంటే... కచ్చితంగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
27
బరువు పెరగడం వల్ల చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ బరువు తగ్గాలని అనుకుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు, మనం వాడే వస్తువులతోనే బరువు తగ్గవచ్చు.
37
బొప్పాయి..
బొప్పాయి పండు తిని ఈజీగా బరువు తగ్గవచ్చు. బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ సమస్యలకి రిలీఫ్ ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి భోజనంలో బొప్పాయి తినొచ్చు. మీకు ఇష్టమైన ఆహారం తినే ముందు, సలాడ్ తినండి.
47
ఓట్స్..
ఓట్స్ తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఫైబర్, కాపర్, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుని నివారిస్తుంది.
57
ఆహారం
సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే సగ్గుబియ్యం ఉపవాసం చేసేటప్పుడు తేలికగా తినే ఆహారం. రాత్రి భోజనంలో సగ్గుబియ్యం తింటే, బరువు తగ్గుతారు. సగ్గుబియ్యం జావ చేసుకొని తాగవచ్చు. మళ్లీ అందులో పంచదార కలపకూడదు.
67
పెసరపప్పులో మీ రక్తపోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే చాలా పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అందుకే రాత్రి భోజనంలో పెసరపప్పు తినాలి. పెసరపప్పుతో దోశ లాంటివి కూడా చేసుకోవచ్చు.
77
గుడ్డు ప్రయోజనాలు
ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్డుని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల, శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి.