సైనస్, దగ్గు సమస్య ఉన్నవాళ్లు రాత్రి పూట పాలు తాగడం ఏమాత్రం మంచిది కాదు. రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉన్న వారిలో శ్లేష్మం ఎక్కువగా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా పాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు కూడా డయాబెటిస్ రోగులకు రాత్రి పాలు తాగకుండా ఉండాలని సలహా ఇస్తారు. ఇందులో లాక్టోస్ అనే సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెంచేస్తాయి.
లాక్టోస్ పడని వాళ్లు పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, ఉబ్బరానికి కారణం అయ్యే అవకాశం ఉంది. గ్యాస్, అజీర్తి లేదా అసిడిటీతో బాధపడేవాళ్లు రాత్రి పాలు తాగకూడదు. ఇది ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. శరీరంలో వాపులు ఉన్నవాళ్లు పాలు తాగడం మానేయాలి. ఇందులో ఉండే సంతృప్త కొవ్వు వాపును మరింత పెంచుతుంది. కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు కూడా పాలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. ముఖ్యంగా మీకు ఫ్యాటీ లివర్ లేదా లివర్ వాపు ఉంటే పాలు తాగొద్దు. ఈ సమస్యలన్నీ పాలు తాగడం వల్ల మరింత ముదిరిపోతాయి.