కొబ్బరి నూనె పెడితే సరిపోదు.. జుట్టు రాలొద్దంటే ఇలా చేయాల్సిందే

Published : Sep 03, 2025, 02:43 PM IST

చాలా మంది కొబ్బరినూనె పెడితే ఇక జుట్టు రాలదని అనుకుంటారు. కానీ మీరు జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం నూనె పెట్టినా జుట్టు బాగా రాలిపోతుంది. 

PREV
16
హెయిర్

హెయిర్ ఫాల్ ఆగాలన్నా, జుట్టు పెరగాలన్నా నూనె పెడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇందుకోసం నూనె ఒక్కటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరగాలన్నా, వెంట్రుకలు రాలడం ఆగాలన్నా లోపలి నుంచి పోషణ అవసరం. లోపలి నుంచి పోషణ లేకుండా జుట్టుపెరగదు. రాలకుండా ఉండదు. నూనె మన జుట్టుకు అవసరమైన పోషణను అందించదని నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టు రాలకూడదంటే ఎలాంటి చిట్కాలు ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
సరైన ఫుడ్ అవసరం

మన జుట్టుకు ప్రోటీన్లు , పోషకాలు చాలా అవసరం. ఎందుకంటే మన జుట్టు ప్రోటీన్లతోనే తయారవుతుంది. కాబట్టి మీ జుట్టు పొడుగ్గా పెరగాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, ఆకు కూరలను, పాలు, పెరుగు వంటి పోషకాలను పుష్కలంగా తీసుకోండి. అలాగే విటమిన్ సి, ఐరన్ ఉన్న ఆహారాలు కూడా జుట్టుకు మంచి మేలు చేస్తాయి. ఇందుకోసం క్యారెట్లు, పాలకూర, సిట్రస్ పండ్లను బాగా తినండి. ఇవి మీ జుట్టును బలంగా చేస్తాయి. మందంగా పెరగడానికి సహాయపడతాయి.

36
ఒత్తిడికి దూరంగా ఉండాలి

ఒత్తిడి చాలా చిన్న సమస్యే అనిపించినా ఇది మన జుట్టుపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల జుట్టు బాగా రాలుతుంది. ఎందుకంటే స్ట్రెస్ కు గురైనప్పుడు జుట్టు పెరుగుదల ఆగిపోయేలా చేసే కొన్ని హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అందుకే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, మెడిటేషన్ చేయండి. ఒత్తిడి తగ్గితేనే జుట్టు రాలకుండా ఉంటుంది.

46
జుట్టు శుభ్రం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, రాలకుండా ఉండాలన్నా జుట్టు సరిగ్గా శుభ్రం చేయడం అవసరం. వేడి నీళ్లతో జుట్టును వాష్ చేస్తే జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీంతో వెంట్రుకలు ఊడిపోతాయి. అందుకే తలస్నానానికి గోరు వెచ్చని నీళ్లనే ఉపయోగించాలి. అలాగే తలను టవల్ తో గట్టిగా తుడవకూడదు. అలాగే తడిగా ఉన్నప్పుడు వెంట్రుకలను దువ్వకూడదు. అలాగే వెడల్పాటి దువ్వెనతోనే దువ్వుకోవాలి.

56
హెయిర్ స్ట్రెయిటెనర్లు

చాలా మంది హెయిర్ డై, హెయిర్ స్ట్రెయిటెనర్లును ఎక్కువగా వాడుతుంటారు. కానీ వీటిని ఉపయోగిస్తే జుట్టు జీవం లేకుండా కనిపిస్తుంది. హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇవి జుట్టు మూలాలను బలహీనంగా చేసి జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా ఉపయోగించకూడదు.

66
నిద్ర అవసరం

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవడం అవసరం. మన జుట్టు ఆరోగ్యానికి కూడా నిద్ర అవసరం. నిద్రపోవడం వల్ల మన జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories