Viagra History: వయాగ్రా గురించి తెలియని వారుండరు. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచేందుకు దీన్ని తెగ వాడతారు. అందుకే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. అసలు ఈ వయాగ్రను దేని కోసం తయారు చేశారో తెలుసా?
అనుకున్నది ఒకటి, అయిందొకటి. ఈ వయాగ్రా మెడిసిన్‍ను ముందు ఒకదాని కోసం తయారు చేస్తే ఇప్పుడది పురుషుల లైంగిక సామర్థ్యం కోసం పనిచేస్తోంది. చాలా మంది ఈ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. చివరకు విప్లవాత్మక మార్పుకు కారణమైంది. లైంగిక సమస్యల నివారణకు పనికొచ్చింది. అసలు దీన్ని ఎందుకోసం తయారు చేశారంటే…
25
గుండె జబ్బుల కోసం
1980వ దశకం చివరలో ఫైజర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు 'సిల్డెనాఫిల్' అనే కొత్త కెమికల్ కనుగొన్నారు. దీనిని ప్రాథమికంగా 'ఎంజినా' అనే గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం సృష్టించారు. ఎంజినా అంటే గుండెకు రక్తప్రసరణ సరిగ్గా అందకపోవడం వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి. రక్తనాళాలను వెడల్పు చేసి, గుండెకు రక్త ప్రవాహాన్ని పెంచడమే ఈ మెడిసిన్ ఉద్దేశం. కానీ 1990 మొదట్లో బ్రిటన్‌లోని స్వాన్సీ హాస్పిటల్‌లో ఈ మందుపై క్లినికల్ ట్రయిల్స్ జరిగాయి. అయితే, శాస్త్రవేత్తలు ఆశించిన స్థాయిలో గుండె జబ్బుల మీద ఈ మందు ప్రభావం చూపలేదు. అంటే ప్రయోగం విఫలమైంది.
35
వయాగ్రా వింతైన సైడ్ ఎఫెక్ట్స్
ప్రయోగంలో పాల్గొన్న పురుషుల్లో ఒక వింత మార్పు కనిపించింది. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత వారిలో లైంగిక సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. అంతేకాకుండా అంగస్తంభన సమస్యలు తగ్గడం గమనించారు. శాస్త్రవేత్తలు మొదట దీనిని సైడ్ ఎఫెక్ట్ అనుకున్నారు. కానీ ఆ మెడిసినే ఇప్పుడు విప్లవాత్మక మార్పుకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.
చివరకు శాస్త్రవేత్తలే తమ పరిశోధన దిశనే మార్చేశారు. గుండె కోసం విఫలమైన ఈ మందు, అంగస్తంభన సమస్యలకు పరిష్కారంగా గుర్తించారు. జననేంద్రియాల వద్ద రక్త ప్రసరణను విపరీతంగాపెంచింది. దీనితో 1998లో అమెరికాకు చెందిన FDA (Food and Drug Administration) దీనిని లైంగిక సమస్యలకు మెడిసిన్‍గా ఆమోదం తెలిపింది.
55
వయాగ్రా షాకింగ్ ట్రూత్
ఈ వయాగ్రా కేవలం పురుషులకే కాదు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే మహిళలపై దీని ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్యుల సలహా లేకుండా దీనిని వాడటం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ మాత్రలు వేసుకునే వారు దీనికి దూరంగా ఉండాలి.