Money Prasadam: దేవుడి గుడిలో ప్రసాదం పంచి పెట్టడం చాలా కామన్. కానీ, మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు డబ్బులు పంచిపెడతారని మీకు తెలుసా? దీని వెనక కారణం ఏంటో తెలుసా?
మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. గుడి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ప్రసాదమే. ఒక్కో టెంపుల్ ఒక్కో ఫేమస్ ప్రసాదం కూడా ఉంటుంది. సాధారణంగా ఏ టెంపుల్ లో అయినా లడ్డూ, పులిహోర లాంటివే ప్రసాదంగా పెడతారు. కానీ, మన దేశంలో భక్తులకు ప్రసాదంగా డబ్బులు( కరెన్సీ నోట్లు, నాణేలు) లేదా బంగారం, వెండి ఆభరణాలు పంచే కొన్ని ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం...
23
1.మధ్య ప్రదేశ్ లోని రత్లాం మహాలక్ష్మీ ఆలయం..
మధ్య ప్రదేశ్ రాష్ట్రం, రత్లాం నగరంలోని మాణక్ చౌక్ ప్రాంతంలో ఫేమస్ లక్ష్మీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులకు డబ్బు, బంగారం, వెండి ఆభరణాలను ప్రసాదంగా పంచి పెడతారు. ముఖ్యంగా దీపావళి, భాయ్ దూజ్ పండగల సమయంలో ఈ ఆలయం దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి కోట్లాది రూపాయల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలను కానుకలుగా సమర్పిస్తారు. దీపావళి పూజల అనంతరం.. భక్తులు సమర్పించిన ఆ నగదు, బంగారం, వెండి ఆభరణాలను అమ్మవారి ప్రసాదంగా తిరిగి భక్తులకు పంచుతారు. ప్రసాద రూపంలో వచ్చిన డబ్బు, ఆభరణాలను భక్తులు తమ ఇంటిలోని బీరువాల్లో లేదా లాకర్లలో దాచుకుంటారు. ఇలా చేస్తే.. ఆర్థిక సమస్యలు తీరిపోతాయని, సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. దాదాపు 300 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
33
2.రాజస్థాన్ లోని బానోడ బాలాజీ నిలయం...
రాజస్థాన్ లోని చిత్తోడ్ గఢ్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఈ మహిమాన్వితమైన ఆలయంలో భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించే కానుకల్లో కొంత భాగాన్ని తిరిగి వారికే ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ భక్తులకు లడ్డూలతో పాటు నగదును కూడా ప్రసాదంగా అందిస్తారు. అలా డబ్బును భద్రంగా ఉంచుకుంటే ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు తాము తీసుకున్న ప్రసాదాన్ని డబ్బుకు మరికొంత మొత్తం జోడించి మళ్లీ ఆలయానికి సమర్పిస్తూ ఉంటారు.
3.తమిళనాడులోని కరుప్ప స్వామి ఆలయం...
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం పద్ధెనిమిదో మెట్టు రక్షకుడు కరుప్ప స్వామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందితో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో భక్తులు కష్టాలను తీర్చి వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో.. ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు.