నవంబర్ నెల టూర్స్ కి వెళ్లడానికి పర్ఫెక్ట్ టైమ్. ఈ టైమ్‌లో వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది… కేవలం హిల్ స్టేషన్లే కాకుండా, ఈ సీజన్లో చూడాల్సిన అందమైన నగరాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో టూర్ వెళ్లడానికి నవంబర్ నెల బెస్ట్ ఆప్షన్. ఎండాకాలంలో విపరీతమైన ఎండ, చలికాలంలో వణికించే చలి ఉండే నగరాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్లేసెస్‌ను నవంబర్‌లో చూడటం చాలా బెటర్. ఈ నెలలో చలి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి వాతావరణం చాలా బాగుంటుంది. ఎండ, చలి ఇబ్బంది లేకుండా ఈ నగరాలను మీరు హాయిగా చుట్టేయొచ్చు.
వారణాసి, ఉత్తరప్రదేశ్
నవంబర్‌లో వారణాసి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇండియాలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిని ఈ టైమ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. పగటిపూట ఇరుకు వీధుల్లో హాయిగా తిరగొచ్చు. ఉదయం, సాయంత్రం జరిగే గంగా హారతిని చూసి మీరు భక్తిభావంలో మునిగిపోతారు. ఫుడ్ లవర్స్‌కు కూడా వారణాసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి లోకల్ ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
25
గోవా
వర్షాకాలం అయిపోయాక నవంబర్ నెలలో గోవా టూరిస్టులతో కళకళలాడుతుంది. ఈ టైమ్‌లో గోవా వాతావరణం ట్రిప్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీరు అవుట్ డోర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. బీచ్‌లలో ఈత కొట్టొచ్చు, సన్‌బాత్ చేయొచ్చు. అలాగే లోకల్ సీఫుడ్ టేస్ట్ చూడొచ్చు. మీరు ప్రశాంతంగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే గోవా బెస్ట్ ఛాయిస్.
35
హంపి, కర్ణాటక
నవంబర్‌లో హంపి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చారిత్రక ప్రదేశాన్ని ఈజీగా చుట్టేయొచ్చు. ఎండాకాలంలో ఎండల వల్ల హంపిని చూడటం కొంచెం కష్టమే. ఇక్కడి పురాతన దేవాలయాలు, శతాబ్దాల చరిత్ర ఉన్న కట్టడాలు, పెద్ద పెద్ద రాళ్లు విజయనగర సామ్రాజ్య కథలను చెబుతాయి. హంపికి వెళ్లినప్పుడు మీరు మంచి ఫొటోలు తీసుకోవచ్చు. చుట్టుపక్కల ప్లేసెస్ చూస్తూ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.
కేరళలోని అందమైన టూరిస్ట్ ప్లేసెస్‌లో అలెప్పీ ఒకటి. ఇక్కడ మీరు హౌస్‌బోట్‌లో ఉంటూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అందమైన కాలువలు, కొబ్బరి చెట్లు, పల్లెటూరి ప్రశాంత జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు అలెప్పీకి వెళ్లొచ్చు. చల్లటి వాతావరణంలో తిరుగుతూ రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అలెప్పీ పర్ఫెక్ట్ ప్లేస్.
55
షిల్లాంగ్, మేఘాలయ
నవంబర్‌లో షిల్లాంగ్ వాతావరణం చాలా చల్లగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ టైమ్‌లో మీరు షిల్లాంగ్ అందాలను కళ్లారా చూడొచ్చు. ఇక్కడి వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేయొచ్చు. అందమైన సరస్సులను చూడొచ్చు. వర్షం లేకపోయినా పెద్ద పెద్ద జలపాతాలను ఇక్కడ చూడొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో టైమ్ స్పెండ్ చేయాలనుకునే వాళ్లకు షిల్లాంగ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.