ఈ బీచ్ ప్రత్యేకతలు..
సముద్ర గర్భంలో నడక: లోటైడ్ సమయంలో నీరు వెనక్కి వెళ్ళినప్పుడు, పర్యాటకులు బైక్‌లపై లేదా నడుచుకుంటూ ఏకంగా సముద్రంలో 5 కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చు. సాధారణంగా నీటి అడుగున ఉండే భూమిపై నడిచే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది.
అరుదైన జలచరాలు: సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ అంతరించిపోతున్న ఎర్ర పీతలు (Red Crabs), హార్స్‌షూ నత్తలు, స్టార్ ఫిష్‌లను నేరుగా చూడవచ్చు.
క్షిపణి ప్రయోగ కేంద్రం (DRDO): భౌగోళికంగా సురక్షితమైన ప్రదేశం కావడంతో భారతదేశానికి చెందిన రక్షణ పరిశోధన సంస్థ (DRDO) తమ అనేక మిస్సైల్ (Ballistic Missiles) ప్రయోగాలను ఈ చాందీపూర్ కేంద్రం నుండే నిర్వహిస్తుంది.
మీరు వెళ్లాలనుకుంటే..ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
సముద్ర గర్భంలో నడవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉన్నప్పటికీ, సముద్రం మళ్లీ తిరిగి వచ్చే (High Tide) సమయాలను స్థానిక గైడ్‌లు లేదా కాలిక్యులేషన్స్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీరు వేగంగా ముందుకు వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం.
ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన వింతను అనుభవించాలనుకునే వారికి చాందీపూర్ బీచ్ ప్రయాణం ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.