కొంతమంది ఒక మాట వింటే దాని అసలు అర్థాన్ని మాత్రమే గ్రహిస్తారు. మరికొందరు ప్రతి మాటలోనూ డబుల్ మీనింగ్ వెతుకుతారు. ఎదుటివాళ్ళు అమాయకంగా మాట్లాడినా, ఆ మాటలను వక్రీకరించి నవ్వుతారు. ఇలాంటి వారి గురించి సైకాలజీ ఏం చెబుతుందో తెలుసా?
సైకాలజీ ప్రకారం… మనం వినే మాటలు, చూసే సంఘటనలు మన మానసిక స్థితికి అద్దం పడతాయి. ఒక వ్యక్తి ప్రతి మాటలో తప్పుడు అర్థాలు వెతుకుతున్నాడంటే, అది అతని ఆలోచనా విధానం, భావాలు, జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటుంది. మన మెదడు దేనిపై ఎక్కువ దృష్టి పెడుతుందో, బయటి ప్రపంచంలో అలాంటి అర్థాలనే వెతుకుతుంది.
26
చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటే
మానసిక నిపుణుల ప్రకారం… ఈ ప్రవర్తనకు ప్రధాన కారణం 'కాగ్నిటివ్ బయాస్'. అంటే, వ్యక్తి మనసులో ముందే ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, కోరికలు.. విన్న ప్రతి మాటను అదే కోణంలో అర్థం చేసుకునేలా చేస్తాయి. ఎవరి మనసులోనైనా చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటే, సాధారణ మాటల్లో కూడా వారికి అలాంటి అర్థాలే కనిపిస్తాయి.
36
మానసిక ఆరోగ్యానికి హానికరం
నిపుణుల ప్రకారం భావోద్వేగ అసంతృప్తి లేదా మనసులోని కోరికలు మరో కారణం. జీవితంలో ఎమోషనల్ లోటు ఉంటే, అది వారి ఆలోచనల్లో కనిపిస్తుంది. అప్పుడు తెలియకుండానే చెడు అర్థాల వైపు ఆకర్షితులవుతారు. అణచివేసిన కోరికలు మాటలు, జోకుల్లో బయటపడతాయి. ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా, దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యానికి హానికరం.
సైకాలజీ ప్రకారం, వ్యక్తి పెరిగిన వాతావరణం, చూసే సినిమాలు, వినే జోకులు, స్నేహితుల మాటలు వారి ఆలోచనా విధానాన్ని రూపొందిస్తాయి. అసభ్యకరమైన హాస్యం, చెడు మాటలు సాధారణమైన వాతావరణంలో పెరిగినవారు, దాన్నే సహజంగా భావిస్తారు. అలాంటివారికి ప్రతి మాటలో డబుల్ మీనింగ్ వెతకడం అలవాటుగా మారుతుంది.
56
ఉద్దేశపూర్వకంగా తప్పుడు అర్థాలు వెతుకుతారు
సైకాలజీ విశ్లేషణ ప్రకారం, కొందరు ఇతరులను కించపరచడానికి, సంభాషణను నియంత్రించడానికి లేదా తమ వైపు దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు అర్థాలను వెతుకుతారు. ఇలా చేయడం వల్ల వారు తమలోని లోపాలను కప్పిపుచ్చుకున్నామనే తప్పుడు భద్రతా భావాన్ని పొందుతారు.
66
పాజిటివ్ వ్యక్తులతో ఉన్నప్పుడు
ప్రతి మాటలో తప్పుడు అర్థం వెతకడం కేవలం మానసిక అలవాటు. సరైన అవగాహన, ఆత్మపరిశీలనతో మార్పు సాధ్యం. ఆలోచనలపై నియంత్రణ సాధిస్తే, మాటలను సానుకూలంగా అర్థం చేసుకోవచ్చు. ధ్యానం, పుస్తకాలు చదవడం, పాజిటివ్ వ్యక్తులతో ఉండటం ఆలోచనా విధానాన్ని మార్చడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.