Dosa: మనం... ఇంట్లో దోశ పిండిని తయారు చేసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా.. పప్పు, బియ్యం నానపెట్టడం, సరిగ్గా రుబ్బుకోవడం, సరిగా పులియబెట్టడం.. ఇవి తెలిస్తే.... మనం దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు.
భారతీయులు.. రెగ్యులర్ గా ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ ముందు వరసలో ఉంటాయి. ఎప్పుడైనా బయటకు వెళ్లినా కూడా.. ఎక్కువగా ఇడ్లీ, దోశ లాంటివే తింటూ ఉంటారు. అయితే.. మనం ఇంట్లో చేసుకునే దోశలు.. క్రిస్పీగా రావు. దీంతో.. చాలా మందికి ఇంట్లో చేసుకునే దోశలు నచ్చవు. అయితే... మనం దోశ పిండి తయారు చేసుకునే సమయంలో ఓ సింపుల్ చిట్కా ఫాలో అయితే.... హోటల్ స్టైల్ లో క్రిస్పీగా చేయచ్చు. మరి.. ఆ చిట్కా ఏంటో చూద్దాం...
మనం... ఇంట్లో దోశ పిండిని తయారు చేసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా.. పప్పు, బియ్యం నానపెట్టడం, సరిగ్గా రుబ్బుకోవడం, సరిగా పులియబెట్టడం.. ఇవి తెలిస్తే.... మనం దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు.
25
దోశ పిండి తయారీకి కావాల్సినవి...
మినపప్పు -1 కప్పు
బియ్యం-2 కప్పులు
ఉడికించిన అన్నం 1 కప్పు
మెంతులు.. రెండు స్పూన్లు
నీరు, ఉప్పు, నూనె తగినంత...
35
తయారీ విధానం...
ముందుగా.. మినపప్పు, బియ్యాన్ని మంచిగా కడిగి నానపెట్టుకోవాలి. రెండింటినీ కలిపి లేదా... విడివిడిగా అయినా నానపెట్టుకోవచ్చు. పప్పు, బియ్యం నానపెట్టినప్పుడే.. మెంతులు కూడా వేసి నానపెట్టుకోవాలి. కనీసం ఈ పప్పు, బియ్యాన్ని ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి.
నానబెట్టిన తర్వాత, నీటిని వడకట్టి, అన్ని పదార్థాలను గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. అలా రుబ్బే సమయంలో.. ఉడికించిన అన్నాన్ని కూడా చేర్చాలి. పిండిని మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
రుబ్బిన పిండికి ½ టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. కంటెయినర్‌ను గట్టిగా కప్పి 8–9 గంటలు లేదా ఉష్ణోగ్రతను బట్టి పులియబెట్టనివ్వండి. పిండి బాగా పులిస్తే.. పిండి రెట్టింపు అయినట్లు కనపడుతుంది. తేలికగా.. పుల్లటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దోశ పిండి రెడీగా ఉన్నట్లు అని అర్థం. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే.. కాస్త నీరు కలుపుకోవచ్చు.
55
క్రిస్పీ దోశలు..
అంతే... ఇప్పుడు మీకు నచ్చినట్లు గా దోశలు వేసుకోవడమే. దోశ మందంగా వేస్తే మెత్తగా.. పల్చగా వేస్తు క్రీస్పీగా, క్రంచీగా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా నచ్చిన చట్నీతో తినేయడమే. అచ్చం హోటల్ లో దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది.