పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి: సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే రక్షణ, తనిఖీ వ్యవస్థలు ఈ రైల్వే స్టేషన్‌లో ఉంటాయి. సరిహద్దు దాటి ప్రయాణించే రైలు కావడంతో, ప్రయాణికుల వద్ద కచ్చితంగా పాస్‌పోర్ట్ , వీసా ఉంటేనే స్టేషన్ పరిసరాలోనికి అనుమతిస్తారు.
కేవలం పాకిస్తానీయులకు మాత్రమే ఈ రూల్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. భారతీయులకు కూడా కఠిన నిబంధనలు ఉంటాయి. మన దేశ పౌరులు కూడా ఎటువంటి అనుమతి పత్రాలు లేదా ముందస్తు పోలీస్ పర్మిషన్ లేకుండా ఈ స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెడితే చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలా అక్రమంగా ప్రవేశిస్తే వారిపై 14 ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.
కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ చెకింగ్: స్టేషన్ లోపలే కస్టమ్స్ క్లియరెన్స్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ప్రయాణికులు రైలు ఎక్కడానికి ముందే వారి బ్యాగులను, పత్రాలను కఠినంగా తనిఖీ చేస్తారు.
అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రతా బలగాల (BSF) పర్యవేక్షణలో ఉండే ఈ అట్టారీ రైల్వే స్టేషన్ ప్రయాణం, భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక విచిత్రమైన, అరుదైన అనుభూతిగా నిలిచిపోతుంది!