జపాన్‌లోని షింగోన్ బౌద్ధమతంలో గణపతిని 'కాంగిటెన్' , 'షోటెన్' లేదా 'గణబచి' అని పిలుస్తారు. జపాన్‌లో ఈ దేవుడిని అదృష్టం, వ్యాపార పురోగతి, జంటల మధ్య ప్రేమానురాగాలను పెంచే దేవుడిగా కొలుస్తారు.
జపాన్ లోని కొన్ని దేవాలయాల్లో రెండు వినాయక రూపాలు ఒకదానికొకటి కౌగిలించుకున్నట్లు (Embracing Ganesha) ఉండే విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ వినాయకుడికి తెల్ల ముల్లంగి, బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలు, సకే (జపనీస్ మద్యం) ను నైవేద్యంగా సమర్పిస్తారు.
థాయిలాండ్ : థాయిలాండ్‌లో గణపతిని 'ఫ్రా ఫికానెట్' అని పిలుస్తారు.
అక్కడ వినాయకుడిని కళలు, సంగీతం, నాట్యం, విద్యకు అధిపతిగా భావిస్తారు. ఏదైనా కొత్త సినిమా, నాటకం, వ్యాపారం లేదా నిర్మాణం ప్రారంభించే ముందు థాయ్ ప్రజలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
థాయిలాండ్‌లోని 'చాచోఎంగ్సారొ' ప్రావిన్స్‌లో 39 మీటర్ల (సుమారు 128 అడుగులు) ఎత్తైన వినాయకుడి విగ్రహం ఉంది. కాంస్యంతో చేసిన ఈ వినాయకుడు కాంస్య వినాయకుడి నిలబడిన భంగిమలోని విగ్రహం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటి.