
ఇద్దరి వ్యక్తుల పోలికలు ఎలా అయితే ఒకలా ఉండవో.. వాళ్ల వ్యక్తిత్వం కూడా భిన్నంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు.. ఇతరుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం సులభం అని భావిస్తారు. మరికొందరు మీరు వారితో ఎంత మాట్లాడినా వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేం అంటారు. నవ్వే విధానం, మాట్లాడే విధానం (way of speaking), మొబైల్ ఫోన్ (Mobile phone) ను పట్టుకునే విధానం, నిద్రపోయే స్థానం (Sleeping position) ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చంటారు నిపుణులు. అంతే కాదు ఒక వ్యక్తి పెదవులను బట్టి కూడా అతని స్వభావాన్ని ఏంటో అర్థం చేసుకోవచ్చని కూడా వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ శాస్త్రవేత్తలు పెదవులు.. వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటిగా భావిస్తారు. మన౦ ఆన౦దాన్ని, కోపాన్ని లేదా దుఃఖంతో ఉన్నప్పుడు మన ముఖంపై ఎన్నో భావాలు కనిప్తాయి. వీటన్నింటికీ మొదటి భౌతిక చిహ్న౦ నోరు. ఎ౦దుక౦టే మన ఫీలింగ్స్ ను , భావాలను నోటి ద్వారానే వ్యక్తపరుస్తాం. అదే సమయంలో మీ పెదవి యొక్క ఆకారం మరింత లోతైన మానసిక లక్షణాలను మరియు వ్యక్తిత్వ లక్షణాలను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు.
హస్త సాముద్రికం ప్రకారం.. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు మరియు స్వభావాన్ని చేతి రేఖల ద్వారా కనుగొనవచ్చు. అదేవిధంగా ఓషనోగ్రఫీ (Oceanography)లో ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు మరియు వ్యక్తిత్వం యొక్క రహస్యాలు శరీరంలోని వివిధ భాగాల నిర్మాణం ఆధారంగా చెప్పబడతాయి. ఒక వ్యక్తి యొక్క కళ్ళు, ముక్కు, చెవులు, పెదవుల పరిమాణం, ఆకారం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఎలాంటి పెదాలున్న వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్రటి పెదవులు (Red lips): ఎర్రటి పెదవులు ఉన్నవారు చాలా కోపంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీళ్లు చాలా ధైర్యవంతులు కూడా. ఎంతటి పరిస్థితినైనా సులభంగా హ్యాండిల్ చేస్తారు. వీళ్లు తమంతట తాముగా ప్రతిదీ చేయాలనుకుంటారు. మీరు ఎంత సంపాదించానా.. ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు.
పింక్ లిప్స్ (Pink Lips): పింక్ లిప్స్ ను శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు చురుకుగా ఉంటారు. మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. వీళ్లు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఈ వ్యక్తులు తమ పనిలో గౌరవాన్ని పొందుతారు. వీరు స్వభావరీత్యా దయగలవారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
Full-shaped lips: పై పెదవి, కింది పెదవి సమానంగా ఉండే వారు స్ట్రాంగ్ పర్సన్స్ . ఈ పెదవి ఆకారం ఉన్న వ్యక్తులు ఇతరులను సంరక్షించడంలో ముందుంటారు. వీరు స్వార్థంగా ఆలోచించరు. ఇతరుల గురించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఇలా చేయడంలోనే వీరు నిజమైన ఆనందాన్ని పొందుతారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. అన్నింటికంటే వీళ్లు ఎక్కువగా సంబంధాలను గౌరవిస్తారు.
సన్నని పెదవులు: సన్నని పెదవులు ఉన్న స్త్రీలు ఒంటరిగా, పిరికిగా ఉంటారు. వీళ్లు అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని (Introverted personality)కూడా కలిగి ఉంటారు. వీళ్ల స్వతంత్ర్యంగా ఉండాలనుకుంటారు. భాగస్వామిని ఉన్నదాంట్లో బాగా చూసుకుంటారు. కాకపోతే శృంగారంలో తమ భాగస్వామిని సాటిస్ఫై చేయలేరు.
పొడుచుకువచ్చిన పెదవులు: పొడుచుకువచ్చిన పెదవులు ఉన్నవారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. అందుకే వీరు తరచుగా తమ జీవితంలో ఇతరుల సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఈ వ్యక్తులు చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
చిన్న పెదవులు: చిన్న పెదవులు ఉన్న వ్యక్తులు సహజంగా కనిపించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి వద్ద చాలా డబ్బు ఉంటుంది. వీళ్లకుంటే చెడు అలవాట్ల వల్ల సమాజంలో చెడ్డ పేరు పొందుతారు. అటువంటి వ్యక్తులు ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసేవారు. అయితే.. జీవితంలో వీరు కోరకున్న విధంగా గొప్పగా బతకడం సాధ్యం కాదు.