షుగర్ పేషెంట్లు ఈ తీపి వంటకాలను ఎంచక్కా తినేయొచ్చు..

First Published Sep 24, 2022, 3:41 PM IST

డయాబెటీస్ పేషెంట్లు తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి వారి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కానీ తీపి పదార్థాలను పదార్థాలను ఎవరికి తినాలని ఉండదు చెప్పండి. 
 

షుగర్ పేషెంట్లకు తీపి పదార్థాలు విషంతో సమానం. ఎందుకంటే ఈ ఆహారాలు వారి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. అందుకే మధుమేహులు స్వీట్ ఐటమ్స్ కు దూరంగా  ఉంటారు. కానీ స్వీట్ ఐటమ్స్ ఎవరికుండదు చెప్పండి. డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఉంటుంది కదా స్వీట్లను తినాలని. అలాగని వీళ్లు శుద్ధి చేసిన చక్కెరతో తయారుచేసిన ఆహారాలను తినకూడదు. అయితే కొన్ని తీపి పదార్థాలు మధుమేహుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 


గ్రీన్ పెరుగు

మాధుమేహులు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఈ గ్రీన్ పెరుగును లాగించొచ్చు. తీపి పదార్థాలను తినాలనిపించినప్పుడు వెంటనే పెరుగులో ఆపిల్ ముక్కలు, ఇతర పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్, బెర్రీలను వేసుకుని మిక్స్ చేసి తినండి. ఇది మీకు  సంతృప్తినిస్తుంది. దీన్ని తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. 
 

ఓట్ మీల్

ఓట్ మీల్ హెల్తీ ఫుడ్. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తీపి వంటకం కానప్పటికీ.. దీనికి కాస్త తీపిని జోడించడానికి కొబ్బరిని, పండిన మెత్తని అరటిపండు, దాల్చిన చెక్కను మిక్స్ చేయండి. ఇది మధుమేహుల ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. తీపి పదార్థాలను తిన్నామన్న  సంతృప్తిని కూడా ఇస్తుంది. 
 

డార్క్ చాక్లెట్స్

డార్క్ చాకెట్స్ ప్రతి ఒక్కరికీ  ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చాక్లెట్స్ ఇతర చాక్లెట్ల కంటే చాలా ఆరోగ్యకరమైనవి. అయితే వీటిని కూడా షుగర్ పేషెంట్లు తినకూడదు. వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీటిని తింటే ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ మధుమేహులు చక్కెర లేని డార్క్ చాక్లెట్లను బేషుగ్గా తినొచ్చు. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 
 

చియా గింజలు

చియా గింజలనే సబ్జా విత్తనాలు అని కూడా అంటారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు చియా విత్తనాలతో చక్కెర లేని ఫుడ్ ను తయారుచేసుకుని తినొచ్చు.   
 

click me!