నోరురించే కొబ్బరి వడలు.. ఇలా తయారు చేస్తే రుచి అదిరిపోతుంది!

First Published Sep 24, 2022, 2:19 PM IST

సాధారణంగా ప్రతిరోజు చాలామందికి వివిధ రకాల స్నాక్స్ తయారు చేసుకొని తినడం అలవాటుగా ఉంటుంది.
 

ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక రెసిపీ తయారు చేస్తూ ఉంటారు.అయితే ఇలా నిత్యం ఏదో ఒక స్నాక్స్ తీసుకునేవారు ఎంతో తొందరగా రుచికరంగా కొబ్బరి వడలను తయారు చేసుకోవచ్చు. అయితే రుచికరమైన కొబ్బరి వడలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...
 

కావలసిన పదార్థాలు: కొబ్బరి కోరు-అర కప్పు (పచ్చి కొబ్బెర), బియ్యం ఒక కప్పు (రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి), జీలకర్ర ఒక టీ స్పూన్, బియ్యపు పిండి అరకప్పు, ఉప్పు తగినంత, నూనె తగినంత
 

తయారీ విధానం: కొబ్బరి వడలు తయారు చేసుకోవడానికి రెండు గంటల ముందు బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.ఇలా రెండు గంటల తర్వాత మరోసారి బియ్యం నానబెట్టిన నీటిని వడపోసి నానబెట్టిన బియ్యం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీలో మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అనంతరం దీనిలోకి కొబ్బరి కోరు, ఉప్పు వేసి మరోసారి మిశ్రమంలో తయారు చేసుకోవాలి.
 

ఇక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెలోకి అరకప్పు బియ్యపు పిండి వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇక మరొక గిన్నెలో నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఒక దళసరి పేపర్ లేదా స్వచ్ఛమైనటువంటి అరిటాకు తీసుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తీసుకొని అరటి ఆకుకు కాస్త నూనె రాసి చిన్నగా పూరి లాగా వత్తుకోవాలి. 
 

ఇలా చేసిన వాటిని నూనె కాగిన తర్వాత ఎరుపు రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా వడలు ఎరుపు రంగులోకి వస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి వడలు తయారైనట్లే. ఈ కొబ్బరి వడలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

click me!