చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే వీటిని తినండి చాలు..

First Published Dec 16, 2022, 12:58 PM IST

చలికాలంలో కీళ్ల నొప్పులు రావడం సర్వ సాధారణం. నిజానికి ఆర్థరరైటిస్ కు చికిత్స లేదు. కానీ కొన్ని రకాల ఆహారాలను తింటే ఎముకల బలం పెరుగుతుంది. కీళ్లలో వాపు తగ్గుతుంది. 
 

joint pain

చలికాలం స్టార్టింగ్ లోనే  దగ్గు, జలుబు, జ్వరం మొదలైన ఎన్నో సమస్యలు అటాక్ చేస్తుంటాయి. వయస్సు, ఆర్థరైటిస్ లేదా మరేదైనా కారణం వల్ల చలికాలంలో కీళ్లు, ఎముకల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. జలుబు కూడా ఈ నొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సిఫారసు చేసిన విధంగా రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.  ఇచ్చిన మందులు వేసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే కూడా నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థరైటిస్ ను పూర్తిగా తగ్గించుకోవడానికి చికిత్స లేదు. కానీ కొన్ని ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే కీళ్ళలో వాపు తగ్గుతుంది. దీనికోసం ఎలాంటి ఆహారాలను తినాలంటే..

కొవ్వు చేపలు

కొవ్వు చేప జాతులైన సాల్మన్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎంతో సాయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల మందులను కూడా కీళ్ల నొప్పులను, ఎముక నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయని ఒక అధ్యయనం తెలిపింది.
 

వెల్లుల్లి

 వెల్లు, ఉల్లిపాయలలో డయలైల్ డైసల్ఫైడ్ ఉంటుంది. ఇది శోథ నిరోధక సమ్మేళనం. అందుకే ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ginger general

అల్లం

తాజా అల్లాన్ని లేదా శొంఠిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంట తగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ మీరు టీ, గ్రేవీలల్లో కూడా వీటిని వేసుకుని తీసుకోవచ్చు. లేదా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకుని కూడా తాగొచ్చు. అల్లం శరీరంలో మంటను ప్రోత్సహించే పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. 
 

గింజలు

గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు, చియా విత్తనాలు, పైన్ విత్తనాల వంటి గింజలను క్రమం తప్పకుండా  తినడం వల్ల కీళ్ల మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

fruits

పండ్లు

 యాపిల్స్, క్రాన్బెర్రీస్, నేరేడు వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఆంథోసైనిన్స్ అధికంగా ఉండే చెర్రీలను తినడం వల్ల కీళ్లు, కండరాలలో వాపు తగ్గిపోతుంది. 

మటన్ లేదా చికెన్ ఎముకల సూప్ లను తాగడం వల్ల మీ ఎముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల పెరుగుదలకు సహాయపడతాయి. ఎముకలను ఉడకబెట్టిన పులుసును క్రమం తప్పకుండా తాగడం వల్ల కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి. 
 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో అసంతృప్త కొవ్వు, ఆరోగ్యకరమైన కొవ్వు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ లో ఒలియోకాంతల్ కూడా ఉంటుంది. ఇది మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో ఆలివ్ ఆయిల్ ను  చేర్చండి. 

click me!