Summer Skin Care: ఎండలు దంచికొడుతున్నాయి. చాలామంది సన్‌స్క్రీన్, ఫేస్ జెల్స్, స్కిన్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సహజమైన ఫలాలు, ఆహార పదార్థాలు కూడా చర్మాన్ని ఎండ దెబ్బ నుంచి రక్షించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికే కాదు, చర్మానికి కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం సమయంలో తీసుకునే కొన్ని ఫలాలు, పోషకాహార పదార్థాలు UV కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నిపుణుల ప్రకారం మన చర్మానికి కూడా ఒక ప్రత్యేకమైన “స్కిన్ క్లాక్” ఉంటుంది. ఇది పగటి సమయంలో సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటే చర్మం సహజ రక్షణ శక్తి మరింత మెరుగుపడుతుంది.
25
బ్లూబెర్రీలు చర్మానికి సహజ రక్షణ
బ్లూబెర్రీలను వేసవిలో చర్మానికి ఎంతో ఉపయోగకరమైన ఫలాలుగా భావిస్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి. కాలుష్యం, ఎండ కారణంగా చర్మం దెబ్బతినకుండా సహాయపడతాయి. అలాగే వీటిలో విటమిన్-C కూడా సమృద్ధిగా ఉండటంతో చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా కనిపిస్తుంది.
35
పుచ్చకాయ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది
వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ కూడా సహజ సన్ ప్రొటెక్టర్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ UVB కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ముఖం కడిగిన తర్వాత పుచ్చకాయ రసం లేదా చల్లటి పల్ప్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉండటంతో పాటు తేమను కూడా నిలుపుకుంటుంది.
గ్రీన్ టీ, క్యారెట్, పాలకూర, ఆక్రోట్లు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి ఆహార పదార్థాలు కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ చర్మాన్ని లోపల నుంచి బలంగా మారుస్తాయి. ఎండ వల్ల కలిగే డ్యామేజ్‌ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
55
ఉదయం ఇలా తీసుకుంటే ఇంకా మంచిది
ఈ ఫలాలు, ఆరోగ్యకరమైన ఆహారాలను ఉదయం సమయంలో జ్యూస్, స్మూతీ లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకుంటున్నామనే కారణంతో సన్‌స్క్రీన్‌ను పూర్తిగా మానేయడం సరైంది కాదు. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడడం, తగినంత నీరు తాగడం, సరైన స్కిన్ కేర్ పాటించడం కూడా చాలా అవసరం.