ఎండలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కాసేపు ఎండలో ఉంటే చెమటతో బట్టలు తడిసిపోయే పరిస్థితి వస్తోంది. ఇలాంటి టైంలో ఎలాంటి బట్టలు కంఫర్ట్ గా ఉంటాయి? ఎలాంటి రంగులను ఎంచుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ చిట్కాలు. చూసి ఫాలో అయిపోండి.
వేసవిలో హాయిగా ఉండాలంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. అందులోనూ లేత రంగుల్లో ఉండే దుస్తులు ఎంచుకోవాలి. ఇవి చెమటను పీల్చుకుని వేడి నుంచి కాపాడతాయి.
వేసవిలో కాటన్ దుస్తులే ఎందుకు?
వేసవిలో చల్ల చల్లని డ్రింక్సే కాదు. ఈ సమయంలో కాటన్ దుస్తులు కూడా మనకు మేలు చేస్తాయి. నార, తేలికపాటి బట్టలు ఎంచుకోవడం మంచిది. ఇవి చెమటను సులభంగా పీల్చుకుంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
వేసవిలో నలుపు రంగు వద్దు!
చాలా మందికి నలుపు రంగు అంటే ఇష్టం ఉంటుంది. కానీ వేసవిలో నలుపు రంగు దుస్తులు వేసుకుని బయటికి వెళ్లడం అంటే పెద్ద సాహసం చేసినట్లే. తల నుంచి పాదం వరకు చెమట కారడం ఖాయం! కాబట్టి ఈ రంగును వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది.
లేత రంగు దుస్తులు
లేత రంగు దుస్తులు వేసవిలో హాయిగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే వేసవిలో లేత కాటన్ కుర్తీ-పైజామా లేదా కాటన్ ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకుని వర్క్ కి, ఆఫీస్ కి వెళ్లవచ్చు. ఇది మిమ్మల్ని చూడటానికి ఎలిగెంట్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?
తీవ్రమైన వేడి నుంచి తప్పించుకోవడానికి వదులుగా ఉండే దుస్తులు ఎంచుకోండి. టీ-షర్టులు, షర్టులు, స్కర్టులు, షార్ట్‌లు లాంటివి ఎంచుకోండి. ఇవి శరీరానికి అతుక్కోకుండా గాలి బాగా తగిలేలా ఉండాలి.
రంగుపై దృష్టి పెట్టండి
వేసవి రోజుల్లో ముఖ్యంగా పగటిపూట స్కూల్-కాలేజీ లేదా ఆఫీస్ ఏదైనా సరే ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించకుండా ఉండండి. ఈ రంగులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల బాగా వేడిగా అనిపిస్తుంది.
వేసవిలో నార, రేయాన్ లైట్ డ్రెస్ వేసుకోండి!
వేసవిలో కాటన్, నార, రేయాన్ లాంటి తేలికపాటి దుస్తులు ఎంచుకోండి. దీని వల్ల వేడి తక్కువగా ఉంటుంది. దుస్తుల్లో గాలి బాగా ప్రసరిస్తుంది.