బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తినండి..

First Published Jan 29, 2023, 11:00 AM IST

బోలు ఎముకల వ్యాధి వల్ల ఎముకలు బలంగా ఉండవు. అయితే మీరు తినే ఆహారంలో ఎముకలను బలంగా ఉంచే పోషకాలు లేకపోవడం వల్లే ఈ వ్యాధి వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ ఎముకలు కాల్షియాన్ని బాగా గ్రహించడానికి సహాయపడతాయి. 
 

భారతదేశంలో అత్యంత సాధారణ అనారోగ్య సమస్యల్లో బోలు ఎముకల వ్యాధి ఒకటి. ఈ వ్యాధి వల్ల ఎముకలు బాగా బలహీనపడతాయి. ఈ అనారోగ్య సమస్య వల్ల మీ ఎముకలు బలహీనంగా, పెళుసులుగా మారుతాయి. అలాగే ఎముకల పగుళ్లకు కూడా ఈ వ్యాధి దారితీస్తుంది.
 

బలమైన ఎముకల కోసం కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం బోలు ఎముకల వ్యాధి ఒక ప్రధాన, సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. మన ఎముకలు కాల్షియంతో తయారవుతాయి. మీకు తెలుసా శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలలో నిల్వ చేయబడుతుంది. మిగిలిన 1 శాతం మాత్రమే రక్తం, కండరాలు, కణజాలాలలో నిల్వ చేయబడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ రోజువారీ ఆహారంలో తగినంత కాల్షియం లేకపోతే మీ శరీరం మీ ఎముకల నుంచి కాల్షియాన్ని బయటకు తీస్తుంది. ఇతర అవసరాలకు దాన్ని ఉపయోగించడం మొదలుపెడుతుంది. 

మీరు తినే ఆహారం ద్వారా కోల్పోయిన దాన్ని బర్తీ చేయకపోతే మీ ఎముకలు కాలక్రమేణా కాల్షియాన్ని బాగా కోల్పోతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బలమైన ఎముకలను కలిగి ఉండటానికి ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల నుంచి ఒక వ్యక్తి రోజుకు కనీసం 1,000 మి.గ్రా కాల్షియం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎక్కువ కాల్షియం మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అదనపు కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అరుదైన సందర్భాల్లో ఎక్కువ కాల్షియం మీ రక్తంలో కాల్షియం నిక్షేపాలకు కారణమవుతుంది. దీనిని హైపర్కాల్సెమియా అంటారు. 

పాలతో పాటు, కాల్షియం ఇతర మొక్కల ఆధారిత వనరులు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి మీకు సహాయపడతాయి. ఒక కప్పు టర్నిప్ ఆకుకూరల్లో 200 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
 

ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 146 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.  సోయాబీన్స్, ఆవాల ఆకులు, బెండకాయ మొదలైన కూరగాయల్లో కూడా కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  కాల్షియంతో పాటుగా ఎముక ఆరోగ్యానికి ఇతర పోషకాలు కూడా చాలా అవసరం. అవేంటంటే.. 
 

మెగ్నీషియం

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన శరీరానికి మెగ్నీషియం కూడా చాలా  అవసరం. మీ ఆహారంలో తగినంత మెగ్నీషియం లేకపోవడం వల్ల కూడా బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

vitamin k

విటమిన్ కె

ఎముకల నిర్మాణం, నిర్వహణలో పాల్గొనే ప్రోటీన్ల పనితీరుకు ఈ విటమిన్  కె అత్యవసరం. అందుకే విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోండి. 
 

zinc

జింక్

సరైన ఎముక పెరుగుదల, నిర్వహణకు జింక్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముక పునరుత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. తక్కువ స్థాయి జింక్ రుతువిరతి బోలు ఎముకల వ్యాధితో సంబంధం కలిగి ఉంది.

click me!