
కడుపు నొప్పి, విరేచేనాల సమస్యలు రావడం సర్వ సాధారణం. అయితే ఈ సమస్యలు వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఆహారం, కలుషితమైన నీరు వల్ల వస్తుంటాయి. విరేచనాల కారణంగా శరీరంలో ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. డీ హైడ్రేషన్, వికారం, విరేచనాలు, పొత్తి కడుపు తిమ్మిరి, వాపు, జ్వరం, మలంలో రక్తం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి యాంటీ బయాటిక్స్, ఇతర మందులు సహాయపడతాయి. అయితే కొన్ని హోం రెమిడీస్ కూడా ఈ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి. అవేంటంటే..
అల్లం (ginger)
అల్లం టీ టేస్టీగా ఉండటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఎన్నో కడుపునకు సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతాయి. వాపు, అజీర్థి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అతిసారాన్ని తగ్గించడంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
చమోమిలి టీ ( chamomile tea)
చమోమిలి టీ కూడా విరేచనాలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీనిలో జీర్ణ సమస్యలను తొలగించే గుణాలున్నాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)
ఆపిల్ సైడర్ వెనిగర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఔషద గుణాలు అతిసారం సమస్యను తొందరగా తగ్గిస్తాయి. కొంత పరిమాణంలో తీసుకోవడం వల్ల డయేరియా సమస్య నుంచి బయటపడతారు. ఇది యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
మెంతులు (fenugreek)
మెంతులను డయేరియాకు ను తగ్గించే అత్యంత ప్రభావవంతమైన సహజ నివారణలలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ విత్తనాల్లో మ్యూకోలైలేస్ ఉంటుంది. ఇది డయేరియాను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
క్యారెట్లు (Carrots)
క్యారెట్లలో యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి. విరేచనాలతో బాధపడేవారు క్యారెట్లను తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. డయేరియా చికిత్సలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.
కొబ్బరి నీరు (coconut water)
కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాదు ఈ నీళ్లు డయేరియా సమస్యను కూడా తొందరగా తగ్గిస్తాయి. డయేరియా వల్ల శరీరంలో గ్లూకోజ్, నీటి స్థాయిలు తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి నీరు ఈ లోపాన్ని తీర్చుతుంది. కొబ్బరి నీళ్ల వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.
అరటి (banana)
అరటిపండులో పెక్టిన్ ఉంటుంది. పొటాషియం కూడా అరటిలో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి సమస్యల నుంచి బయటపడేయడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నల్ల ఉప్పుతో అరటిపండ్లను తింటే తొందరగా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.