ఆరోగ్యానికి మంచిదే.. కానీ నెయ్యిని వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారంటే వీళ్ల పని అంతే..

First Published Jul 31, 2022, 4:03 PM IST

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ తింటుంటారు. నెయ్యిని ఏ రూపంలో తీసుకున్నా ప్రయోజనాలు అందుతాయి. కానీ వీళ్లు మాత్రం నెయ్యికి దూరంగా ఉండటమే వీరి ఆరోగ్యనికి మంచిది. 
 

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ తింటుంటారు. నెయ్యిని ఏ రూపంలో తీసుకున్నా ప్రయోజనాలు అందుతాయి. కానీ వీళ్లు మాత్రం నెయ్యికి దూరంగా ఉండటమే వీరి ఆరోగ్యనికి మంచిది. 

వేడి వేడి అన్నంలో.. పచ్చిడితో పాటుగా కాస్త నెయ్యి వేసుకుని తింటే.. అబ్బా ఎంతో రుచిగా ఉంటుంది. నెయ్యిని రోటీ మీద కూడా తింటుంటారు. ప్రతి రోజూ ఒక టీ స్పూన్ నెయ్యిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతారు. నెయ్యితో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. 

నెయ్యిని తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఫిట్ గా ఉంటుంది. అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీని వాడకం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. కానీ ఇది కొందరికి విషంతో సమానం. వీరు ఎట్టిపరిస్థితిలో నెయ్యిని తినకూడదు. నెయ్యిని ఎవరెవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

కడుపునకు సంబంధించిన సమస్యలున్న వారు

కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు నెయ్యిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా కడుపు నొప్పి, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యిని తినకపోవడమే మంచిది. నిజానికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యిని తింటే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కడుపునకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటే నెయ్యిని మొత్తానికే తినకండి. 
 

లివర్ సిర్రోసిస్ కు హానికరం

లివర్ సిర్రోసిస్ ఉన్నవారికి నెయ్యి విషకంటే తక్కువేమీ కాదు. ఇలాంటి సమయంలో వీళ్లు నెయ్యిని తినకూడదు.  నిజానికి ఈ వ్యాధిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా కాలేయం శాశ్వతంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే ఇలాంటి సమయంలో నెయ్యిని తినకూడదు..
 

హార్ట్ పేషెంట్స్

మనం తీసుకునే ఆహారమే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది ఒకదాని తర్వాత ఇంకోటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే నెయ్యిలోని కొవ్వు ఈ కొలెస్ట్రాల్ మరింత పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హార్ట్ పేషెంట్స్ డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే నెయ్యిని తీసుకోవాలి.
 

దగ్గు

దగ్గు, జలుబు సమస్యతో బాధపడే వారు నెయ్యికి దూరంగా ఉండాలని నిపుణులు సలహానిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యలతో బాధపడేవారు నెయ్యిని తింటే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది. దగ్గు కూడా విపరీతంగా పెరుగుతుంది. డాక్టర్ లేదా స్పెషలిస్ట్ సలహా మేరకు మాత్రమే నెయ్యి తీసుకోవడం మంచిది.
 

సీజనల్ ఫీవర్ 

సీజనల్ ఫీవర్ తో బాధపడేవారు కూడా నెయ్యిని తినకూడదు. ఆయుర్వేదంలో సీజనల్ ఫీవర్ లో నెయ్యిని తీసుకోవడం హానికరంగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం జ్వరంతో బాధపడే వ్యక్తులు నెయ్యితి తింటే దగ్గు వస్తుంది. జ్వరం కూడా ఎక్కువ అవుతుంది. 

click me!