Sudden Stomach Ache: అకస్మాత్తుగా పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తుందా..? దీనికి కారణాలు ఇవే కావొచ్చు..!

First Published Aug 10, 2022, 1:59 PM IST

Sudden Stomach Ache: ఫుడ్ అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్, ఎసిడిటీ, వంటి జీర్ణ సమస్యల వల్ల పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి పుడుతుంది.
 

పొత్తికడుపు నొప్పి చాలా సాధారణ సమస్య. అయితే ఇది వివిధ కారణాల వల్ల వస్తుంది. ఎసిడిటీ, ఫుడ్ అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్, బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, వ్యాధి వంటి వివిధ జీర్ణ సమస్యల వల్ల వస్తుంది. ఉన్నట్టుండి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, మెడ నొప్పి, ఛాతి నొప్పి, భుజం నొప్పి, మలంలో రక్తం పడటం, నల్లటి విరేచనాలు వంటి సమస్యలకు వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రాణాంతకం. 
 

పొత్తికడుపు ఎగువ కుడి వైపున నొప్పి ఉంటే.. అది కాలేయం లేదా పిత్తాశయంతో సమస్య అని అర్థం చేసుకోవాలి. అదే పొత్తికడుపు ఎగువ ఎడమ వైపున నొప్పి ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు, అల్సర్లు మొదలైన సమస్యలు వచ్చాయని అర్థం చేసుకోవాలి. పొత్తి కడుపు దిగువ భాగంలో నొప్పి ఉంటే.. తాపజనక పేగు కదలికలు లేదా హెర్నియా, ఇతర వ్యాధులతో పాటు ఐబిఎస్  తో బాధపడుతున్నారని అర్థం చేసుకోండి. ఆకస్మిక కడుపు నొప్పికి ఇంకొన్ని ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Irritable bowel syndrome (IBS)

 పొత్తికడుపులో విపరీతమైన నొప్పి ఐబిఎస్ వల్ల కూడా కావొచ్చు. ఇది ఒక ప్రేగు సంబంధిత పొత్తి కడుపు నొప్పి. అలాగే ఇది మలబద్దకానికి కారణమవుతుంది.
 

ఫుడ్ పాయిజన్

 ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కూడా పొత్తి కడుపులో నొప్పి పుడుతుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వల్ల హానికరమైన జీవులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. కడుపు, ప్రేగులను ఇబ్బందికి గురిచేస్తాయి. దీంతో కడుపులో మంట, వాంతులు, విరేచనాలు అవుతాయి. ఈ కారణంగా కూడా పొత్తి కడుపు నొప్పి వస్తుంది. 
 

పిత్తాశయం లేదా అల్సర్ నొప్పి

పిత్తాశయం, అల్సర్ కు సంబంధించిన సమస్యల కారణగా కడుపు నొప్పి వస్తుంది. ఇది సాధారణంగా కడుపు పై భాగంలో లేదా పొత్తికడుపు  పై భాగంలో వస్తుంది.
 

stomach ache

 గ్యాస్

గ్యాస్ సమస్య కారణంగా కూడా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి పుడుతుంది. గ్యాస్ వల్ల కలిగే కడుపునొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. 
 

stomach ache

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)

ప్రతిరోజూ మీరు పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నట్టైతే అది యుటిఐకి సంబంధించినదే కావొచ్చంటున్నారు నిపుణులు. పొత్తికడుపు నొప్పి యుటిఐ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి.

click me!