Evening Exercise: సాయంత్రం ఎక్సర్ సైజ్ చేస్తే ఎన్ని లాభాలున్నాయో..కానీ ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే..!

Published : Aug 10, 2022, 12:56 PM IST

Evening Exercise: కొంతమంది ఉదయం పూట వ్యాయామాలు చేస్తే మరికొంతమంది మాత్రం సాయంత్రం వేళ చేస్తుంటారు. అయితే సాయంత్రం పూట వ్యాయామాలు చేసేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.   

PREV
19
 Evening Exercise: సాయంత్రం ఎక్సర్ సైజ్ చేస్తే ఎన్ని లాభాలున్నాయో..కానీ ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే..!

వ్యాయామాల వల్ల శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే ఈ రోజుల్లో వ్యాయామం చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. వారికున్న సమయాన్ని బట్టి కొందరు ఉదయం పూట ఎక్సర్ సైజ్ లు చేస్తే.. మరికొంత మంది మాత్రం సాయంత్రం వేళ చేస్తుంటారు. అయితే కొంతమంది కేవలం వ్యాయామం ఉదయం పూటే చేయాలని భావిస్తుంటారు. నిజానికి వ్యాయామాలు ఉదయమే కాదు.. సాయంత్రం వేళ కూడా చేయొచ్చంటున్నారు నిపుణులు.  అందులోనూ సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

29

ఒత్తిడి నుంచి ఉపశమనం

గజిబిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా లేదా వ్యాయామం ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు ఇవి మనలో సానుకూల ఆలోచనలు కూడా కలిగిస్తాయి. మానసికంగా మిమ్మల్ని దృఢంగా  ఉంచుతాయి. మొత్తంగా సాయంత్రం వేళ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. 
 

39

మరిన్ని లాభాలు

ఉదయం వ్యాయామం చేయడానికి ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలి. ఎందుకంటే మనం నిద్రలేచినప్పుడు మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అయితే సాయంత్రం పూట వ్యాయామం చేయడానికి వార్మప్ అవసరం లేదు. దీంతో మీ సమయం, శక్తి రెండూ ఆదా అవుతాయి. దీంతో మీరు వ్యాయామం వల్ల మరింత ప్రయోజనాన్ని పొందుతారు. 
 

49

ఎముకలు బలంగా తయారవుతాయి

పొద్దంతా పనిచేయడం వల్ల ఎముకలపై ఒత్తిడి పడి బలహీనపడతాయి. అయితే ఎముకలను ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు వ్యాయామం ఎంతో సహాయపడుతుంది.  అయితే సాయంత్రం వేళ ఎక్సర్ సైజెస్ చేయడం వల్ల శరీర అలసట మటుమాయం అవుతుంది. బలహీనత సమస్య కూడా పోతుంది. ముఖ్యంగా రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అంతేకాదు కండరాలు కూడా బలంగా మారుతాయి. 

59

నిద్ర సమస్యలు పోతాయి

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోని వారు సాయంత్రం వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్ లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. దీనివల్ల కళ్లు బాగా అలసిపోతాయి. దీనివల్ల రాత్రిళ్లు నిద్రకూడా పట్టదు. దీనివల్ల శరీరం బాగా అలసిపోతుంది. ఇలాంటి వారు సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే.. రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా పోతాయి. 
 

 

69

రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది

రెగ్యులర్ గా సాయంత్రం వేళ వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

79

జాగ్రత్తలు

ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. సాయంత్రం వేళ చేస్తే కూడా అలాంటి ప్రయోజనాలే కలుగుతాయి. అయితే సాయంత్రం వేళ వ్యాయామం చేసే వారు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

89

ఖాళీ కడుపుతో చేయాలి

ఉదయం పూట వ్యాయామాలను ఖాళీ కడుపుతోనే చేస్తారు. అలాగే సాయంత్రం వేళ వ్యాయామం చేసే వారు కూడా ఖాళీ కడుపుతోనే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే వ్యాయామం చేయడానికి కొన్ని గంటల ముందు ఎలాంటి భారీ ఆహారాలను తినకూడదు. ఇలా తింటే మీ వ్యాయామ శక్తి జీర్ణక్రియలోనే వేస్ట్ అవుతుంది. 
 

99

వ్యాయామం చేసిన తర్వాత నిద్రపోవద్దు

ఎక్సర్ సైజెస్ చేయడం వల్ల మెటబాలిజం రేటుతో పాటుగా గుండెకొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వ్యాయామం చేసిన తర్వాత కొద్ది సేపటి వరకు నిద్రపోవద్దు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిరూపించబడింది.   

Read more Photos on
click me!

Recommended Stories