Blouse Designs: చీర కట్టుకుంటే బొద్దుగా కనపడుతున్నారా? ఈ బ్లౌజులతో సన్నగా కనిపిస్తారు

Published : Jul 20, 2026, 05:16 PM IST

Blouse Designs:  చీర కట్టుకుంటే బొద్దుగా కనిపిస్తున్నాం అని ఫీలౌతున్నారా? అయితే.. మీరు చీర కట్టుకోవడం మానుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ బ్లౌజు డిజైన్లు మార్చితే సరిపోతుంది.  కొన్ని రకాల బ్లౌజు డిజైన్లు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి.

PREV
16
చీరలో సన్నగా కనిపించాలంటే...

చీరలో ఎలాంటివారైనా అందంగా కనిపిస్తారు.  కానీ, అలా అందంగా కనిపించాలంటే.. మంచి బ్లౌజులు ఎంచుకోవాలి.  చాలా మంది చీర కట్టుకుంటే  లావుగా కనిపిస్తున్నాం అని.. చీర కట్టుకోవడమే మానేస్తూ ఉంటారు. కానీ, మీరు సరైన బ్లౌజులు ధరిస్తే.. సన్నగా చీరలో మరింత అందంగా కనిపించొచ్చు.  అలా కనిపించాలంటే.. ఎలాంటి బ్లౌజులు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

26
వి నెక్ బ్లౌజు..

చీరలో బొద్దుగా  కనిపిస్తున్నాం అని ఫీలయ్యేవారు.. వీ నెక్ బ్లౌజులు ధరించాలి.  వీటిని ధరించడం వల్ల  మెడ పొడవుగా, పై భాగాన్ని సన్నగా చూపిస్తాయి.  మరీ డీప్ వీ  నెక్ కాకుండా.. కాస్త మీడియం డెప్త్ ఉన్న వి నెక్ ఎంచుకుంటే చాలా ఎలిగెంట్ , సౌకర్యంగా ఉంటుంది.

36
మో చేతి వరకు స్లీవ్స్...

మీ చేతులు కాస్త లావుగా ఉంటే, మోచేతి వరకు స్లీవ్స్ కుట్టించుకోవాలి. ఇవి చేతులకు బ్యాలెన్స్డ్ లుక్ ఇచ్చి, క్లాసీ లుక్ ఇస్తాయి. స్లీవ్స్ పై చిన్న ఎంబ్రాయిడరీ లేదా బోర్డర్ లుక్ ఉంటే.. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.

46
ప్రిన్సెస్ కట్ బ్లౌజు..

ప్రిన్సెస్ కట్ బ్లౌజులు బాడీ ఫిట్టింగ్ కు మంచి షేప్ ఇస్తాయి.  దీని స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ నడుమును చాలా అందంగా చూపిస్తుంది. దీని వల్ల మొత్తం లుక్ సన్నగా చూపిస్తుంది.  ఈ డిజైన్ దాదాపు అన్ని రకాల చీరలతో సులభంగా మ్యాచ్ అవుతుంది..

56
డీప్ బ్యాక్ నెక్...

మరీ చిన్నగా లేదా హై నెక్ ఉన్న బ్లౌజులు శరీరాన్ని  మరింత హెవీగా చూపిస్తాయి. దానికి బదులుగా, వెడల్పాటి యూ షేప్ లేదా డీప్ రౌండ్ బ్యాక్ నెక్ ఎంచుకోండి. దీని వల్ల బ్యాక్ లుక్ బ్యాలెన్స్డ్ గా ఉండి, బ్లౌజుతో స్టైలిష్ గా చూపిస్తుంది. అవసరమైతే డోరీ కట్టుకోవచ్చు.

66
చిన్న ప్రింట్లు, నిలువు డిజైన్లు ఎంచుకోండి

బ్లౌజ్‌పై పెద్ద పెద్ద డిజైన్లు లేదా హెవీ వర్క్‌కు బదులుగా చిన్న ప్రింట్లు, సన్నని లేస్ లేదా నిలువుగా ఉండే ఎంబ్రాయిడరీని ఎంచుకోండి. దీనివల్ల శరీరం బ్యాలెన్స్‌డ్‌గా, సన్నగా కనిపిస్తుంది. సాలిడ్ రంగులు లేదా చిన్న ప్యాటర్న్‌లు ఉన్న బ్లౌజ్‌లు కూడా బొద్దుగా ఉన్నవారికి చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories