Strong beer: బీర్లలో ఆల్కహాల్ శాతం 4% నుంచి 8% వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని ప్రత్యేక బీర్లు ఉన్నాయి. వీటిలో ఆల్కహాల్ శాతం సాధారణ బీర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఆల్కహాల్ శాతం కలిగిన బీర్‌గా Scottish Beithir Fire గుర్తింపు పొందింది. దీనిని 88 Brewery అనే కంపెనీ తయారు చేస్తోంది. ఈ బీర్‌లో ఆల్కహాల్ శాతం ఏకంగా 75% ఉంటుంది. మొదట దీనిని స్కాటిష్ ఏల్‌గా రెండు నెలల పాటు తయారు చేస్తారు. తర్వాత ప్రత్యేక స్కాటిష్ స్పిరిట్‌ను కలిపి ఆల్కహాల్ స్థాయిని పెంచుతారు. అనంతరం ఫెర్మెంటేషన్, ఫిల్టరేషన్ ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. ఈ బీర్ ఎంత బలంగా ఉంటుందంటే, ఒకేసారి 35 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ తాగొద్దని తయారీదారులు హెచ్చరిక ఇస్తారు.
26
స్నేక్ వీనమ్ – పేరుకే కాదు, ప్రభావంలోనూ ప్రమాదకరం
స్నేక్ వీనమ్ ప్రపంచంలో అత్యంత బలమైన బీర్ల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తుంది. దీనిని Brewmeister తయారు చేస్తోంది. ఈ బీర్‌లో ఆల్కహాల్ శాతం 67.5% ఉంటుంది. ఇందులో నిజమైన పాము విషం లేకపోయినా, మత్తు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతారు. ప్రత్యేక మాల్ట్‌లు, రెండు రకాల ఈస్ట్‌లను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఫెర్మెంటేషన్ సమయంలో పలుమార్లు ఫ్రీజ్ చేసే విధానంతో ఆల్కహాల్ స్థాయిని పెంచుతారు.
36
ఆర్మగడ్డోన్ (Armageddon) – బీర్, విస్కీ మధ్య ప్రత్యేక కలయిక
ఈ బీర్‌లో ఆల్కహాల్ శాతం 65% ఉంటుంది. గోధుమలు, క్రిస్టల్ మాల్ట్, ఓట్స్, స్కాటిష్ స్ప్రింగ్ వాటర్‌తో దీనిని తయారు చేస్తారు. బీర్ రుచి, విస్కీ బలం రెండింటి కలయికగా దీనిని అభివర్ణిస్తారు. అధిక ఆల్కహాల్ కోరుకునే వారికి ఇది ప్రత్యేక ఎంపికగా నిలిచింది.
స్టార్ట్ ది ఫ్యూచర్ బీర్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన Koelschip అనే కంపెనీ తయారు చేసింది. ఈ బీర్‌లో ఆల్కహాల్ శాతం 60% ఉంటుంది. అత్యంత బలమైన బీర్ తయారు చేయాలనే లక్ష్యంతో యూరప్‌లోని మైక్రో బ్రూవరీలు చేసిన ప్రయోగాల్లో ఇది ఒకటి. రాత్రి తాగితే మరుసటి రోజు కూడా ప్రభావం కనిపించేంత బలంగా ఉంటుందని చెబుతారు.
56
స్ట్రెంత్ ఇన్ నెంబర్స్ – రెండు దేశాల సంయుక్త ప్రయత్నం
స్ట్రెంత్ ఇన్ నెంబర్స్ అనే బీర్‌ను స్కాట్లాండ్‌కు చెందిన బ్రూడాగ్, జర్మనీకి చెందిన Schorschbräu కలిసి తయారు చేశాయి. ఈ బీర్‌లో ఆల్కహాల్ శాతం 57.8% ఉంటుంది. ప్రత్యేకమైన "Eisbock" విధానాన్ని ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఇందులో బీర్‌ను ఫ్రీజ్ చేసి, ఏర్పడిన మంచును తొలగించి మళ్లీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. అదనంగా 10 సంవత్సరాల పాటు విస్కీ బ్యారెల్స్‌లో నిల్వ చేసిన బెల్జియన్ గోల్డెన్ ఏల్‌ను కలపడం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది.
66
సాధారణ బీర్‌తో వీటి తేడా ఏంటి?
సాధారణంగా మార్కెట్లో లభించే బీర్లలో ఆల్కహాల్ శాతం 4% నుంచి 8% మధ్యలో ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక బీర్లలో 57% నుంచి 75% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అందుకే వీటిని సాధారణ బీర్లలా కాకుండా స్పిరిట్స్ మాదిరిగా తక్కువ పరిమాణంలో మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఆల్కహాల్ కారణంగా వీటి ప్రభావం చాలా వేగంగా కనిపించే అవకాశం ఉంటుంది.