నందూ బ్యాగ్రౌండ్...
నందన స్వస్థలం మంగళగిరి సమీపంలోని పెద్ద వడ్లపూడి. అయితే... విజయవాడలోనే పెరిగారు. విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. ఆమె భర్త మధు గుంటూరుకు చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. 29 ఏళ్ల క్రితం ఓ పెళ్లిలో వీరికి పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా లేని కాలం కాబట్టి.. ఆ సమయంలో వీరు ఉత్తరాలతో తమ ప్రేమాయణం సాగించారు. తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
యూకే ప్రయాణం.. అక్కడ ఎదుర్కొన్న కష్టాలు...
పెళ్లి తర్వాత వీరు యూకే వెళ్లారు. అక్కడ వారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లైన 2 నెలలకే ఉద్యోగం పోతే.. రెండు సంవత్సరాలు పార్ట్ టైమ్ ఉద్యోగం చేశారు. ఇంటి అద్దె కట్టడానికి, తిండి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సొంత ఇల్లు కొనే వరకు పిల్లలను కూడా కనకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే, పెళ్లైన ఆరేళ్ల తర్వాత వాళ్లు బిడ్డను ప్లాన్ చేసుకున్నారు.