మోచేతులు నల్లగా ఉన్నాయా? తెల్లగా కావాలంటే ఇలా చేయండి

చేతులంతా తెల్లగా, శరీరం రంగులో ఉంటే మోచేతులు మాత్రం కొందరికి నల్లగా ఉంటాయి. ఇవి వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మోచుతులు కనిపించే డ్రెస్సులను కూడా వేసుకోలేకపోతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 
 

some tips to get rid of dark elbows rsl
Here are some simple home remedies to get rid of dark elbows and knees


కొంతమంది చేతులంతా ఒక రంగులో మోచేతులు మాత్రం ఒక రంగులో ఉంటాయి. అంటే నల్లగా ఉంటాయి. దీనివల్ల ఎంత ఇష్టమైన డ్రెస్సైనా సరే మోచేతులకు పైకి ఉండే వాటిని పక్కన పెట్టేస్తుంటారు. మోచేతుల నలుపు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మోచేతులు నల్లగా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

some tips to get rid of dark elbows rsl
dark elbow

1. ఒక టీస్పూన్ పెరుగును తీసుకుని అందులో ఒక టీస్పూన్ వెనిగర్ లేదంటే నిమ్మరసాన్ని కలిగి మోచేతులకు అప్లై చేయండి. కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మోచుతుల రంగు తెల్లగా మారుతుంది. 


elbow

2. ఒక టీస్పూన్ పెరుగును తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఓట్ మీల్ ను వేసి బాగా కలగలపండి. ఈ మిశ్రమాన్ని మోచేయికి అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ కూడా చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. 

elbow

3. ఒక టీస్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లగ ఉండే మోచేయిపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత వాష్ చేయండి. 

4. టీస్పూన్ శనగపిండిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల టమోటా రసాన్ని కలపండి. దీన్ని మోయేయికి అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేయండి. 
 

5. కలబంద గుజ్జును తేనెను సమానంగా  తీసుకుని రెండింటినీ మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మోచేయిపై అప్లై చేసి కాసేపటి తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

6. నల్లగా ఉండే మోచేతులకు, మోకాళ్లకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను అప్లై చొయొచ్చు. ఇవి నల్ల రంగును పోగొట్టి బాడీ కలర్ లోకి  మార్చడానికి సహాయపడతాయి. 
 

dark elbow

6. పచ్చి పాలలో బాదం పప్పులను గ్రైండ్ చేసి మోచేతులకు అప్లై చేయడం వల్ల కూడా మోచేతుల నలుపు తొలగిపోతుంది. 

7. నిమ్మకాయను చక్కెరలో కొద్దిసేపు నానబెట్టి మోచేతులపై రుద్దాలి. దీనివల్ల కూడా మోచేతుల నల్లని రంగు పోతుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!