ఈ ఆహారాలు కడుపు క్యాన్సర్ కు దారితీస్తాయట.. జర జాగ్రత్త..

First Published Nov 22, 2022, 1:00 PM IST

ప్రస్తుతం జరుగుతున్న పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతాయి. అందులో కడుపు క్యాన్సర్ ఒకటి. అసలు ఇవి కడుపు క్యాన్సర్ కు ఎలా దారితీస్తాయంటే.. 
 

stomach cancer


మనం తినే ఆహారాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం.. వీటిలో కడుపు క్యాన్సర్ కూడా ఉంది. ఇది మన దేశంలో నాలుగొవ అత్యంత సాధారణ క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ మీ కడుపులోని ఏ భాగంలైనా అభివృద్ధి చెందొచ్చు. ఇతర దేశాల్లో చాలా మంది కడుపు క్యాన్సర్ కేసులు.. కడుపు, అన్నవాహిక (గ్యాస్ట్రోఎసోఫాగియల్) జంక్షన్ వద్ద అభివృద్ధి చెందుతుంది. కానీ దక్షణి భారతదేశంలోని చాలా మందిలో పైలోరస్ అని పిలిచే కడుపు దిగువ భాగంలో క్యాన్సర్ వస్తుంది. పాశ్యాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాల్లోనే కడుపు క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అసలు ఈ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది. దీని ప్రమాదక కారకాల గురించి.. దీని రిస్క్ ను తగ్గించుకోవడానికి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది నవంబర్ ను కడుపు క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. 

పోషకాహారం, క్యాన్సర్ ప్రమాదంపై కొనసాగుతున్న పరిశోధనల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఊరగాయ వంటివి అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తాయి. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ బారిన పడేస్తాయి. సాధారణంగా ఇండియాలో చాలా మంది ఊరగాయలను ఇష్టంగా తింటుంటారు. అంతేకాక ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వలల ఎన్ నైట్రోసో (NOCs) సమ్మేళనాలు సంశ్లేషణకు కారణం కావొచ్చు. వీటిలో మనుషులకు క్యాన్సర్ కలిగించేవిగా ఉన్నాయని ఐఎఆర్ సి ద్వారా గుర్తించబడ్డాయి. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ తో సహాయ ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మీ ఆహారంలో సోడియం మొత్తంలో 2,300 మిల్లీ గ్రాముల కంటే తక్కువగానే ఉండాలి. 
 

food infection

ఫుడ్ ఇన్ఫెక్షన్

అపరిశుభ్రమైన ఆహరంలో కనిపించే  H పైలోరి అనే ప్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అయ్యి పొట్ట క్యాన్సర్ వస్తుంది. ఇండియాలో ఈ సక్రమణ చాలా సర్వసాధారణం. మొత్తం జనాభాలో 50 నుంచి 80 శాతం మందిలో ఇది కనిపిస్తుందని అంచనా. హెచ్.పైలోరీ సక్రామ్యత అనేది కడుపులోని పైలోరస్ భాగం కడుపు క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కలుషితమైన ఆహారం ద్వారా వస్తుంది. అంతేకాదు ఇది గ్యాస్ట్రైటిక్ కు కూడా కారణం కావొచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం..   అధిక ఉప్పు వినియోగం హెలికోబాక్టర్ పైలోరి సక్రమణ ప్రమాదంతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారంలో జీవిస్తుంది. హెచ్.పైలోరి ఇన్ఫెక్షన్లు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతాయట. 
 

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ట్రస్టెడ్ సోర్స్ 2018 విశ్లేషణ ప్రకారం..  సాసేజ్లు వంటి ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసం రోజుకు 60 గ్రాముల వరకు, రెడ్ మీట్ రోజుకు 130  గ్రాముల వరకు తినడం వల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం సుమారు 20 శాతం వరకు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రాసెస్ చేసినన మాంసాన్ని తినడం వల్ల కార్సినోజెనిక్, కొలెరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం 18 శాతం పెరుగుతుందట. 
 

ultra-processed food

అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు

ప్రోటీన్ ఐసోలేట్లు, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఫ్లేవర్ ఎన్హాన్సర్లు, థిడనర్లు, కృత్రిమ స్వీటెనర్లు  వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ప్యాకేజ్డ్ స్వీట్, టేస్టీ  చిరుతిళ్లు,  సోడా, ఎనర్జీ డ్రింక్స్, ఉదయం తృణధాన్యాలు, అల్ట్రా ప్రాసెస్డ్ మాంసం ఉత్పత్తులు, స్తంభింపచేసిన పిజ్జాలు, క్యాండీలు, మరెన్నో అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన భోజనం, పానీయాలు కడుపు క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని బాగా పెంచుతాయి. 

stomach cancer

ఫుడ్ సప్లిమెంట్స్

ప్రాసెసింగ్ మరీ ఎక్కువగా చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ తో పాటుగా మరెన్నో ప్రాణాలను తీసే దీర్ఘకాలిక రోగాలు రావొచ్చంటున్నారు నిపుణులు. అనారోగ్యాల బారిన పడకూడదంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఉత్పత్తులను తీసుకోవడాన్ని చాలా వరకు తగ్గించాలి. కొన్ని ఆహారపు అలవాట్లు. నిర్ధిష్ట ఆహారాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  
 

click me!