శవాసనంలో నిద్రపోయినా.. ఈ తప్పులు చేసినా.. దాని ప్రయోజనాలు అస్సలు పొందలేరు..

First Published Nov 22, 2022, 11:48 AM IST

శవాసనం వేయడం ఈజీ. కానీ దీనిలో చాలా మంది కొన్ని తప్పులను చేస్తుంటారు. ఫలితంగా ఈ ఆసనం వల్ల పొందాల్సిన ప్రయోజనాలను మిస్ అవుతుంటారు.  
 

Shavasana

శవాసనంతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనివేయడం చాలా సులవు కూడా. యోగాసనాలు ముగిసిన తర్వాత పక్కాగా శవాసనం వేయాలని చాలా మంది చెప్తుంటారు. శవాసనం వల్ల అలసిన శరీరానికి తక్షణ విశ్రాంతి లభిస్తుంది. శవాసనం ఒత్తిడిని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. జస్ట్ ఒక ఐదు నిమిషాలు శవాసనం వేసినా.. మీ శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. 

అయితే చాలా మంది శవాసనంలో కూడా తప్పులు చేస్తుంటారు. దీన్ని ఎలా పడితే అలా చేస్తే.. దీని ప్రయోజనాలు అస్సలు పొందలేరంటున్నారు నిపుణులు. అసలు శవాసనం ఎలా వేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వీళ్లు శవాసనం వేయకూడదు

శవాసన సాధన చాలా సులువు. కానీ కొంతమంది శవాసనానికి వీలైనంత దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చివరి త్రైమాసికంలో ఉన్నప్పుడు శవాసనం అసలే వేయకూడదు. వెన్ను నొప్పి ఉన్నవాళ్లు, వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్లు శవాసనం వేయకూడదు. 
 

శవాసనంలో నిద్రపోకూడదు

నిజానికి శవాసనం మన మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అయితే చాలా మంది ఈ భంగిమలో ఉండేసరికి నిద్రలోకి జారుకుంటారు. కానీ శవాసనంలో నిద్రపోతే దీని ప్రయోజనాలను పొందలేరు. కాబట్టి శవాసనం చేసేటప్పుడు శ్వాసపై దృష్టి పెట్టండి. అప్పుడు నిద్రరాదు. 

Shavasana

శవాసనం ఎక్కడ పడితే వేయకూడదు

శవాసనం చాలా సులువని దీన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. శవాసనం వేసే ప్లేస్ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉండాలి. పెద్ద పెద్ద సౌండ్లు వచ్చే ప్లేస్ లో శవాసనం వేస్తే దాని ఫలితాలను పొందలేరు. టెర్రస్ మీద లేదా నిశ్శబ్ద ప్రదేశంలో శవాసనం వేయాలి. 

కదలిక

చాలా మంది ఐదు నిమిషాలు కూడా ఒకే భంగిమలో నిద్రపోలేకపోతుంటారు. ఇలాంటి వారు శవాసనం వేసేటప్పుడు కుదురుగా ఉండలేరు. శవాసనం వేసేటప్పుడు ఒకే స్థితిలో కదలకుండా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. చేతులను ఆడించడం, శరీరాన్ని కదిలించడం చేయకూడదు. శవాసనంలో 10 నిమిషాలైనా కదలకుండా ఉండాలి. 
 

శవాసనం అయిపోయిన తర్వాత ఈ తప్పు చేయకండి

నిజానికి 10 నిమిషాల పాటు శవాసనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది శవాసనం సాధన అయిపోయిన వెంటనే అకస్మత్తుగా మేల్కొంటారు. ఇలా అస్సలు చేయకూడదు. శవాసనం అయిపోయిన వెంటనే నెమ్మదిగా కాళ్లు, చేతులను కదపండి. ఆ తర్వాత కుడి వైపునకు తిరిగి కూర్చోండి. 

శవాసనానికి చాప అవసరం

యోగాను ఎప్పుడూ చాపపైనే చేయాలి. కానీ కొంతమంది మెత్తని మంచంపైనో లేకపోతే పూర్తిగా నేలపైనో చేస్తుంటారు. ఈ రెండు తప్పే.. శవాసనం చేసేటప్పుడు సరైన చాపను ఉపయోగించుకోవాలి. ఆన్ లైన్ లో యోగా మ్యాట్ లు దొరుకుతాయి. వీటివల్ల  ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. 

click me!