Smoking Effect: స్మోకింగ్ ను మానలేదో.. ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..

Published : Jun 03, 2022, 04:10 PM IST

Smoking Effect: బీడీ, సిగరేట్ ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పొగతాగే వారికి నోటి క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్  బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు తెలుసో తెలియదు.. స్మోకింగ్ వల్ల ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు.   

PREV
18
Smoking Effect: స్మోకింగ్ ను మానలేదో.. ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..
smoking

Smoking Effect: పొగతాగే వారికి తెలుసు.. దీన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని. అన్ని తెలిసి కూడా స్మోకింగ్ ను మానుకోనివారు చాలా మందే ఉన్నారు. వీరికి తెలియని విషయం ఏమింటంటే.. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని. ముఖ్యంగా స్మోకింగ్ చేయడం వల్ల సోకే క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. 

28

Smoking వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధూమపానం వల్ల మెదడు (Brain), గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ స్మోకింగ్ దాటికి ప్రతి ఏడాది లక్షల మంది ప్రాణలు కోల్పోతున్నారు. 
 

38

బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke): స్మోకింగ్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల బాడీలోని Important tissue తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా బ్రెయిన్ పరిమాణం (Brain size) తగ్గుతుందట. అంతేకాదు దీనివల్ల డిమెన్షియం కూడా వస్తుందట. ఇక దీని బారిన పడ్డారంటే మెమోరీ పవర్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

48

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిగరేట్లను ఎక్కువగా కాల్చడం వల్ల stroke వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. ముఖ్యంగా ప్రతీ రోజు 20 సిగరేట్లు లేదా అంతకంటే ఎక్కువ కాల్చే వారికి ఆరు రెట్లు ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇకనైనా దీన్నిమానుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. 
 

58

స్మోకింగ్ వల్ల ఒక్కటేమీ ఎన్నో రోగాలు చుట్టు కునే అవకాశం ఉంది.  హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మొదలు పెడితే.. డయాబెటీస్, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు  స్మోకింగ్ చేయడం వల్ల బిడ్డ ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

68

క్యాన్సర్ బారిన పడకూడదంటే స్మోకింగ్ మానుకోవడంతో పాటుగా లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా.. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 ఏండ్లు దాటిన తర్వాత హెల్త్ చెకప్ లు తప్పకుండా చేయించుకోవాలి. అప్పుడే క్యాన్సర్ ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు. 
 

78

ముఖ్యంగా స్మోకింగ్ ఎక్కువగా చేసే వారు ఖచ్చితంగా సీటీ స్కానింగ్ తీయించుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాలకేం ప్రమాదం ఉండదు. 
 

88

ఈ క్యాన్సర్ మొదటి దశను ముక్కు, గొంతు, చెవి ద్వారా కూడా గుర్తించవచ్చు. ఏదేమైనా మీరు క్యాన్సర్ బారిన పడకూడదంటే ఖచ్చితంగా స్మోకింగ్ ను మానేయాల్సిందే.    

Read more Photos on
click me!

Recommended Stories