చాలామంది శని, ఆదివారాల్లోనే డి-మార్ట్‌కు వెళ్తుంటారు. కానీ వీకెండ్స్‌లో జనం ఎక్కువగా ఉండటం వల్ల కొత్త ఆఫర్లు లేదా స్పెషల్ డిస్కౌంట్లు దొరకడం కష్టం… అసలు ట్రాలీ పట్టుకుని నడిచేందుకే వీలుండదు. అదే సరిగ్గా వారంమధ్యలో అంటే మంగళ, బుధవారాల్లో డిమార్ట్‌కు వెళితే ఎక్కువ లాభం ఉంటుంది.
డిమార్ట్ లో వారానికోసారి మరీముఖ్యంగా మంగళ, బుధవారాల్లో తాజా కూరగాయలు, పండ్లు, సరుకులపై కొత్త ఆఫర్లు పెడతారు… కాబట్టి ఈరోజుల్లో అయితే మంచి సరుకు, తక్కువ ధరకు పొందవచ్చు. అంతేకాదు వర్కింగ్ డేస్‌లో జనం తక్కువగా ఉంటారు కాబట్టి కంగారు లేకుండా ప్రతి వస్తువు ధరను పోల్చి చూసుకుని నిదానంగా కొనుక్కోవచ్చు.
ఇక ప్రతినెల ఆరంభంలో కూడా డిమార్ట్ లో కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది… కాబట్టి సరైన ఆఫర్లు, డిస్కౌంట్స్ ను పొందలేం. కాబట్టి నెల మొదటి వారం కంటే 15 నుంచి 25వ తేదీల మధ్య వెళ్తే రద్దీ తక్కువగా ఉండి, మంచి డిస్కౌంట్లు దొరుకుతాయి.