AC Remote: ఏసీ రిమోట్ లో ఈ 3 బటన్లు వాడితే కరెంట్ బిల్ అస్సలు పెరగదు

Published : May 27, 2026, 06:29 PM IST

AC Remote: ఏసీని సమ్మర్‍లో ఇష్టమొచ్చినట్లు వాడుతారు. దాంతో ఇంటికి చాంతాడంత కరెంట్ బిల్ వస్తుంది. దానికి తోడు ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంటుంది. అయితే ఏసీ వాడుతూనే కరెంట్ బిల్ కూడా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అదెలాగో ఇక్కడ చూద్దాం.

PREV
15
కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా?

అన్ని చోట్ల ఎండలు మండిపుతున్నాయి. మినిమమ్ 40°C నుంచి 45°C ఉష్ణోగ్రతలు ఉంటుంది. దీంతో వేడికి భయపడి జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. అందుకే ఇలాంటి టైంలో అందరూ ఇంట్లో ఏసీలకు అతుక్కుపోతారు. ఏసీ ఆన్ చేస్తే చాలు కనీసం 16-18 లో పెట్టుకుంటాం. చలికి వణికిపోయినా కూడా అలానే ఉంచుకుంటారు. దాంతో కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. అది చూసి షాక్ అవ్వాల్సిందే.

25
కరెంట్ బిల్ తగ్గించే చిట్కాలు

ఏసీ టెంపరేచర్‌ను ప్రతి 1°C తగ్గించినా విద్యుత్ వాడకం 6% పెరుగుతుంది. అందుకే 16°C, 24°C మధ్య తేడా కరెంట్ బిల్లుపై నేరుగా ప్రభావం చూపుతుంది. మానవ శరీరానికి 24°C నుంచి 26°C ఉష్ణోగ్రత సౌకర్యంగా ఉంటుంది. ఈ టెంపరేచర్‌లో కంప్రెసర్ తరచుగా ఆగిపోతుంది. దాంతో కరెంట్ ఆదా అవుతుంది.

35
ఏసీ రిమోట్‌లో ఉన్న ముఖ్యమైన బటన్లు

ఏసీ రిమోట్‌లోని 'మోడ్' బటన్‌ను సరిగ్గా వాడటం కూడా చాలా ముఖ్యం. చాలామంది 'కూల్ మోడ్' మాత్రమే వాడతారు. కానీ 'డ్రైమోడ్' గాలిలోని తేమను తగ్గించి, ఎక్కువ టెంపరేచర్‌లో కూడా చల్లగా అనిపించేలా చేస్తుంది. 'స్లీప్ మోడ్' వాడితే, రాత్రిపూట ఏసీయే ఆటోమేటిక్‌గా టెంపరేచర్‌ను పెంచుతుంది. దీనివల్ల అనవసర కరెంట్ ఖర్చు తగ్గుతుంది. ఇన్వర్టర్ ఏసీలలో ఉండే 'ఎకో మోడ్' కూడా కరెంట్ ఆదాకు సాయపడుతుంది.

45
ఏసీతో విద్యుత్ ఆదా చేసే మార్గాలు
ఫ్యాన్ స్పీడ్ విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. స్పీడ్ తక్కువగా పెడితే కరెంట్ ఆదా అవుతుందని అనుకుంటారు, కానీ అది తప్పు. 'ఆటో మోడ్'లో పెడితే, గది ఉష్ణోగ్రతకు తగ్గట్టు ఏసీయే ఫ్యాన్ స్పీడ్‌ను మార్చుకుంటుంది. 'స్వింగ్' ఫీచర్ వాడితే చల్లని గాలి గది అంతటా సమానంగా వ్యాపిస్తుంది.
55
ఏసీని సరైన విధంగా ఉపయోగించే పద్ధతి
తరచుగా ఏసీని ఆన్-ఆఫ్ చేయడం, తలుపులు-కిటికీల మధ్య గ్యాప్ ఉంచడం, ఫిల్టర్‌ను శుభ్రం చేయకపోవడం వంటి అలవాట్లు కూడా కరెంట్ బిల్లును పెంచుతాయి. సరైన సెట్టింగ్స్, చిన్నపాటి జాగ్రత్తలతో ప్రతినెలా కరెంట్ బిల్లులో గణనీయంగా ఆదా చేయవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories