Chicken: స్కిన్ vs స్కిన్‌లెస్ ఈ రెండింటిలో ఏ చికెన్ తింటే ఆరోగ్యకరం? ఏది తినకూడదు?

Published : Jan 18, 2026, 10:09 AM IST

Chicken: నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం. ఇక చికెన్ బిర్యానీ అంటే చెవికోసుకుంటారు ఎంతో మంది. అయితే స్కిన్ తో ఉన్న చికెన్, స్కిన్ లెస్ చికెన్.. ఈ రెండింటిలో ఏది తింటే మంచిది? ఏది ఆరోగ్యకరం?

PREV
14
చికెన్ ఎలా తినాలి?

మాంసాహారం తినే వారికి చికెన్ వంటకాలు ఉంటే చాలు పొట్ట నిండా తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ వంటకాలు కచ్చితంగా వండాల్సిందే. అయితే చాలా మందికి చికెన్ విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. చికెన్ ను స్కిన్ తో తినాలా? లేక స్కిన్ లెస్ తినాలా? అని ఎంతోమంది ఆలోచిస్తారు. కొంతమంది స్కిన్ తో తింటే ఆరోగ్యానికి మంచిది కాదని కొంతమంది అంటారు. మరికొందరు స్కిన్ లేకుండానే తినాలనుకుంటారు. అయితే స్కిన్ లేదా స్కిన్ లెస్ చికెన్… ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసుకోండి.

24
చికెన్ స్కిన్ తినవచ్చా?

పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం  చికెన్ స్కిన్‌లో మూడింట రెండొంతుల కొవ్వు ఉంటుంది. అందుకే దీన్ని తినకూడదని ఎంతో మంది అంటారు. అయితే  ఆ కొవ్వులో ఎక్కువ భాగం అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఎందకంటే ఇందులో ఒమేగా-6 లాంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.

34
ఎంత చికెన్ తినాలి?

అధిక బరువుతో బాధపడుతున్నవారు స్కిన్ ఉన్న చికెన్ తినకపోవడమే మంచిదిజ. దీని వల్ల మీరు కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంది. 
స్కిన్‌లెస్ చికెన్ (170 గ్రా): కేవలం 280 కేలరీలు ఉంటాయి.
స్కిన్‌తో ఉన్న చికెన్ (170 గ్రా): సుమారు 380 కేలరీలు ఉంటాయి.
అంటే స్కిన్‌తో ఉన్న చికెన్ శరీరానికి సుమారు 100 అదనపు కేలరీలను అందిస్తుంది. కాబట్టి సన్నగా ఉన్నవారు, వ్యాయామం చేసే వారు స్కిన్ ఉన్న చికెన్ తినవచ్చు. స్కిన్ తో కూడిన చికెన్ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ చర్మంలోని సహజ నూనె మాంసం కూరలో కలిసి పోతుంది.  దీనివల్ల చికెన్ మెత్తగా ఉండి, గట్టిపడదు. స్కిన్‌తో చికెన్ వండి నచ్చకపోతే తినేటప్పుడు తీసేయడం మంచి పద్ధతి. ఇది రుచిని పెంచుతుంది. అనవసరమైన కొవ్వు కూడా శరీరంలోకి చేరకుండా అడ్డుకోవచ్చు.

44
స్కిన్ చికెన్ ఎవరు తినకూడదు

చర్మంతో ఉన్న చికెన్ తినడం ఆరోగ్యానికి  కొంతవరకు మేలు చేసినా, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు దాన్ని పూర్తిగా వదిలేయడం మంచిది.

బరువు తగ్గాలనుకునేవారు: అదనపు కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి స్కిన్ తో ఉన్న చికెన్ తినకూడదు.
గుండె జబ్బులు ఉన్నవారు: రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నవాళ్లు చర్మాన్ని తినడం మానేయాలి.
మధుమేహం: చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి తక్కువ కొవ్వు ఉన్న ప్రొటీన్ తినాలి. వీరు స్కిన్ చికెన్ దూరంగా పెట్టాలి. 
అధిక కొలెస్ట్రాల్: ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు స్కిన్‌లెస్ చికెన్ తినడం ఉత్తమం. లేకుంటే స్కిన్ ఉన్న చికెన్ తినడం వల్ల మరింత కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. 

జిమ్‌కు వెళ్లేవాళ్లు, కండరాలు పెంచుకోవాలనుకునేవాళ్లు చికెన్ తినడం చాలా మంచిది.  దీని వల్ల ఎక్కువ ప్రొటీన్ పొందవచ్చు. చికెన్ మాత్రమే కాదు ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమే. కానీ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి స్కిన్ లెస్ చికెన్ తినాలా? స్కిన్ ఉన్న చికెన్ తినాలా అన్నది నిర్ణయించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories