టమాటాతో అదిరిపోయే అందం మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..!

Published : Jan 09, 2023, 03:05 PM IST

అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి మొటిమలు, మచ్చలను కలిగిస్తాయి. అయితే ఈ సమస్యలను ఇంట్లోంచే వదిలించుకోవచ్చు. అదికూడా ఒక్క టొమాటో ఫేస్ ప్యాక్ తో..   

PREV
16
టమాటాతో అదిరిపోయే అందం మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..!

యువత ఎక్కువగా ఎదుర్కొనే చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మటిమలు రావడానికి కారణాలెన్నో ఉంటాయి. అందులో సూర్యరశ్మి ఒకటి. అవును అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడితే  మొటిమలను అవుతాయి. ఈ మొటిమల వల్ల మొండి మచ్చలు అవుతాయి. అంతేకాదు సూర్యరశ్మి వల్ల చర్మ రంగు కూడా మారుతుంది. ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగించి మీ చర్మం మెరిసేలా చేయడానికి టమోటాలు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం టమాటాల ఫేస్ ప్యాక్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

టొమాటోలు- చక్కెర

ముందుగా టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలో ఒక టీస్పూన్ పంచదారను కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీట్ గా కడిగేయండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వెళ్లే ముందు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. ఇది మీ ముఖాన్ని అందంగా తయారుచేస్తుంది. మొటిమలను తొలగిస్తుంది కూడాను. 
 

36

టొమాటోలు - పెరుగు

పెరుగు కూడా మొటిమలను తగ్గించడానికి, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇందుకోసం పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్ ను కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు తొలగిపోతాయి. 

46

టమోటాలు- తేనె

తేనె చర్మానికి మరింత గ్లోను తీసుకొస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందుకోసం టొమాటో జ్యూస్, తేనె మిశ్రమాన్ని ముఖ్యానికి బాగా పట్టించి కొద్ది సేపు మసాజ్ చేయండి. దీనివల్ల మొటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.
 

56

face pack

టమోటాలు - కలబంద

ఒక టీస్పూన్ టమోటా రసంలో ఒక టీస్పూన్ కలబంద జెల్ ను మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, కనురెప్పలపై అప్లై చేయండి. 15 నిమిషాల ఈ తర్వాత కడిగేయండి.  ఈ ఫేస్ ప్యాక్ వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నలుపుదనం తొలగిపోతుంది. 
 

66

టమోటాలు- నిమ్మకాయలు

టొమాటో జ్యూస్, నిమ్మరసం కలిపిన మిశ్రమానికి కొద్దిగా తేనె కలపండి. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయండి. కొన్ని నిమిషాల తర్వాత నీట్ గా కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా మెరిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories