చలికాలంలో జుట్టు రాలకూడదంటే ఇలా చేయండి

First Published Jan 9, 2023, 1:05 PM IST

పొడి, చల్లని గాలి చలికాలంలో జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఈ సీజన్ లో మీ జుట్టు రాలకూడదన్నా.. బలంగా, ఒత్తుగా ఉండాలన్నా కొన్ని చిట్కాలను ఖచ్చితంగా పాటించాలంటున్నారు నిపుణులు. 
 

చలికాలంలో చాలా మందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. నిజానికి చలికాలంలో వేడి వేడిగా.. రుచిగా ఉండి.. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలనే ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ దీనివల్ల మీ జుట్టు దారుణంగా రాలిపోతుంది. మారుతున్న సీజన్లతో జుట్టు, చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు ఈ  సీజన్ లో జుట్టు రాలకుండా ఆపడానికి, జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

hair fall

శీతాకాలంలో చాలా మంది వేయించిన ఆహారాలు, స్వీట్లను ఎక్కువగా తింటుంటారు. కానీ ఈ ఆహారాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా హీట్ స్టైలింగ్, కాలుష్యం కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తూ, జుట్టు సంరక్షణ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. 

వేడి నీటితో స్నానం చేయకండి

వేడి నీరు మీ జుట్టుకు హాని కలిగిస్తుంది. అలాగే జుట్టు రాలడానికి కారణమవుతుంది.  చలికాలంలో చాలా మంది వేడినీటితోనే తలస్నానం చేస్తుంటారు. దీనివల్ల శరీరం రిలాక్స్ అయినా.. జుట్టు ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అందుకే సాధ్యమైనంతవరకు వేడినీటితో తలస్నానం చేయకండి. జుట్టు దెబ్బతినకుండా రక్షించడానికి మీ జుట్టును శుభ్రపరచడానికి వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం తప్పనిసరి

జుట్టుక ఆయిల్ మసాజ్ లు చాలా మంచివి. ఎందుకంటే ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వారానికి ఒకసారి ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల నెత్తిమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మసాజ్ కోసం కొబ్బరి నూనె, ఆముదం నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి హెయిర్ ఆయిల్స్ ను వాడండి. ఇవి జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీ జుట్టుకు పోషణను అందిస్తాయి. 

దువ్వడానికి ముందు మీ జుట్టును ఆరబెట్టండి

తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. ఒకవేళ మీరు తడి జుట్టును దువ్వితే మీ జుట్టు బాగా రాలుతుంది. చలికాలంలో హెయిర్ షాఫ్ట్ బలహీనంగా, పెళుసుగా ఉంటుంది. అందుకే మీ జుట్టు మరింత రాలిపోతుంది. కాబట్టి దువ్వడానికి ముందు మీ జుట్టును గాలికి బాగా ఆరబెట్టండి. 
 

పోషకమైన జుట్టు ఉత్పత్తులను ఎంచుకోండి

చలికాలం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. జుట్టు, నెత్తిమీద పొడిగా ఉంటుంది. పొడి నెత్తి వల్ల నెత్తిమీద చుండ్రు ఏర్పుడుతుంది. దురద కూడా పెడుతుంది. దీని ఫలితంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టును తేమగా ఉంచడానికి పోషకమైన షాంపూలను, కండిషనర్లను, హెయిర్ మాస్క్ లను ఉపయోగించండి. అవోకాడో, హైలురోనిక్ ఆమ్లం, మకాడమియా, అరటి వంటి పదార్ధాలను ఉపయోగించండి. ఇవి జుట్టుకు చాలా పోషకమైనవి.

హెయిర్ ప్రొటెక్టర్ ఉపయోగించండి

జుట్టు ఊడిపోకూడదంటే.. జుట్టును ఎండ, కాలుష్యం నుంచి రక్షించుకోవాలి. ఎక్కువ కాలుష్యం, సూర్యరశ్మి లు జుట్టును దెబ్బతీస్తాయి. అలాగే జుట్టు రాలడానికి దారితీస్తుంది. అందుకే బయటకు వెళ్లినప్పుడు జుట్టును కవర్ స్కార్ఫ్ లను, క్యాప్ లను ఉపయోగించండి.

జుట్టును తరచుగా కడగకండి

చలికాలంలో నెత్తి పొడిగా ఉంటుంది. దీనికి తోడు రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ తేమ అంతా తొలగిపోతుంది. అందుకే తరచుగా తలస్నానం చేయకండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టును కడగడం మంచిది. ఇతర రోజుల్లో.. జుట్టు, నెత్తిమీద శుభ్రంగా ఉంచడానికి పొడి షాంపూలను ఉపయోగించండి.
 

మీ ఆహారంలో హైడ్రేటింగ్ పండ్లు, కూరగాయలను చేర్చండి

తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. బ్రోకలీ, బచ్చలికూర, క్యారెట్లు వంటి కూరగాయలతో పాటుగా నారింజ, ఆపిల్, కివి, ద్రాక్ష వంటి పండ్లను తినండి. ఇవి మిమ్మల్ని, మీ జుట్టును హైడ్రేటింగ్ గా ఉంచి, మీ జుట్టుకు పోషణను అందిస్తాయి.

click me!