చలికాలంలో చర్మం నల్లగా మారుతోందా? ఇలా చేస్తే.. చర్మం అందంగా ప్రకాశిస్తుంది..

Published : Nov 19, 2022, 12:45 PM IST

శీతాకాలంలో చర్మం రంగు నల్లగా మారుతుంది. ముఖ్యంగా ముఖం నీరసంగా అయ్యి కళ తప్పుతుంది. ఇలా జరగకూడదంటే  కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి.   

PREV
15
చలికాలంలో చర్మం నల్లగా మారుతోందా? ఇలా చేస్తే.. చర్మం అందంగా ప్రకాశిస్తుంది..

నిజానికి చలికాలంలో చలిని తట్టుకోవాలంటే.. పక్కాగా ఎండలో కూర్చోవాల్సిందే.  ఎంతటి వెచ్చని బట్టలు వసుకున్నా.. ఎండలో నిలబడనిదే.. పూర్తిగా చలి వదలదు. అయితే ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలో చర్మం రంగు పూర్తిగా మారుతుంది. ఎండలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల చర్మం పొడిబారడమే కాదు.. నల్లగా అవుతుంది కూడా. దీంతో చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల సన్ స్క్రీన్ లోషన్స్ ను ఉపయోగిస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ తో స్కిన్ డార్క్ నెస్ ను పోగొట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25


పసుపు, శెనగపిండి

నిజానికి పసుపు మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సహజ సౌందర్య ప్రొడక్ట్ గా పనిచేస్తుంది. పసుపుతో ముఖంపై ఉన్న నలుపుదనాన్ని పోగొట్టొచ్చు. ఇందుకోసం కొంచెం శెనగపిండిని తీసుకుని అందులో కొంచెం పసుపు, పాలు పోసి పేస్ట్ లా కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు బాగా రాయండి. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. 
 

35


కలబంద గుజ్జు

కలబంద మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగిస్తుంది. గ్లోను పెంచుతుంది. చర్మం తేమగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ రంగు మారకుండా చూస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును తీసుకుని ముఖానికి మెడకు అప్లై చేయాలి. కావాలనుకుంటే దీన్ని చేతులకు కూడా పెట్టొచ్చు. ఒక పది నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే చర్మం అందంగా మెరిసిపోతుంది. 
 

45

బంగాళాదుంప రసం

బంగాళాదుంప రసం ఎన్నో చర్మ సమస్యలను తొలగిస్తుంది. సూర్యరశ్మి వల్ల ముఖం నల్లగా మారితే.. బంగాళాదుంప రసాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం బంగాళాదుంపలను మిక్సీ పట్టి దాన్ని నుంచి రసాన్ని తీయండి. ఈ రసాన్ని దూది సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. ఇది టానింగ్ ను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 

55

టమాటా గుజ్జు

టమాటాల్లో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడతాయి. టమాటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుది. ఇది ఎన్నో చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇందుకోసం టమాటాలను కట్ చేసి లేదా గ్రైండ్ చేసి ముఖానికి రుద్దాలి. దీన్ని పదినిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. టమాటా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖాన్ని అందంగా మార్చుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories