ఎవరైతే వృద్ధాప్య ఛాయలు దరికి చేరకుండా ఉండడం కోసం కష్టపడుతుంటారు అలాంటి వారు కొవ్వు శాతం తక్కువగా ఉన్నటువంటి టోన్డ్ పాలు తాగాలని సూచిస్తున్నారు. 5,834 మంది యుక్త వయస్కులపై కొన్నేళ్ల అధ్యయనం చేసిన అనంతరం నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ అధ్యయనం అనంతరం కొవ్వు శాతం అధికంగా ఉన్నటువంటి పాలు తాగిన వారి కన్నా తక్కువ కొవ్వు శాతం కలిగి ఉన్నటువంటి టోన్డ్ పాలు తాగేవారు ఎంతో యవ్వనంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.