చలికాలంలో ఒంటినిండా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నారా? ఇదెంత డేంజరో తెలిస్తే.. మళ్లీ అలా పడుకోరు..

Published : Nov 19, 2022, 11:40 AM IST

శీతాకాలంలో చాలా మంది రాత్రిళ్లు చలికి తట్టుకోలేక దుప్పటిని ఒంటినిండా కప్పుకుని పడుకుంటుంటారు. కానీ ఇంత గ్యాప్ కూడా లేకుండా దుప్పటిని కప్పుకుంటే మాత్రం లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
14
 చలికాలంలో ఒంటినిండా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నారా? ఇదెంత డేంజరో తెలిస్తే.. మళ్లీ అలా పడుకోరు..

కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత మరీ ఎక్కువైంది.  దీంతో చాలా మంది 24 గంటలు స్వెట్టర్ తోనే ఉంటున్నారు. ఫ్యాన్లను ఆన్ చేసుడు మానేశారు. ఇకపోతే రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోవడానికి రూమ్ హీటర్లను ఆన్ చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇంకొంతమంది గదిని వేడిగా ఉంచడానికి చిన్న చిన్న మంటలను కూడా వేస్తుంటారు. కానీ ఈ అలవాట్లు అస్సలు మంచివి కావు. ఇకపోతే చాలా మంది చలికాలంలో నిద్రపోయేటప్పుడు ఒంటిని పూర్తిగా కప్పేస్తుంటారు. కాళ్లు, ముఖం కూడా కనిపించకుండా. కానీ ఈ అలవాటు చాలా డేంజరని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇలా పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

24

చలిపెడుతుందని ఇంత కూడా గ్యాప్ లేకుండా దుప్పటిని పూర్తిగా కప్పి పడుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా నోటిని, ముక్కును దుప్పటితో కప్పితే.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం శరీరాన్ని దుప్పటితో కప్పితే.. ఆక్సిజన్ ప్రవాహానికి అడ్డంకి కలుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా వంటి రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

34

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడం చాలా ముఖ్యం. కానీ శరీరం మొత్తం కవర్ అయ్యేలా దుప్పటి కప్పితే.. మనకు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. దీనివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాదు. బాగా అలసిపోతారు. తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. 
 

44

శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గితే.. జీవక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల మీ శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల మీ  శరీర బరువు పెరిగి.. కొద్దిరోజుల్లోనే ఊబకాయం బారిన పడతారు. ఈ ఊబకాయం వల్ల గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోజు నుంచి దుప్పటి పూర్తిగా కప్పుకోకండి. ముఖ్యంగా నోటిని, ముక్కును.  

Read more Photos on
click me!

Recommended Stories