
ఆయిలీ స్కిన్ తో ఇబ్బంది పడేవారు చాలా మందే ఉంటారు. ఆయిలీ స్కిన్ వల్ల ఎంత మేకప్ వేసుకున్నా.. పౌడర్ రాసుకున్నా ఫలితమే ఉండదు. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికే మొటిమలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు తరచుగా నీళ్లతో ముఖం కడుగుతూ ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడే ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు. ఇంతకీ వీళ్లు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు, పాల ఉత్పత్తులు
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మొదటగా నివారించాల్సిన ఆహారాలో పాలు, పాల ఉత్పత్తులు లీస్ట్ లో ఫస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇవి చర్మంపై మరింత ఆయిల్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పాలను గానీ పాల ఉత్పత్తులను గానీ తీసుకోకూడదు.
కాఫీ
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు కాఫీని కూడా ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది మీ ముఖంపై మొటిమల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు కెఫిన్ కు దూరంగా ఉండాలి.
జంక్ ఫుడ్
పాస్తా, జంక్ ఫుడ్, జ్యూస్ లల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాల్లు చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తినకండి. ముఖ్యంగా బేకరీ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండండి. వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మంపై ఆయిల్ ను మరింత ఉత్పత్తి చేస్తుంది.
ఉప్పు
మన శరీరానికి ఉప్పు అవసరమే అయినా.. ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం అస్సలు మంచిది కాదు.. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ తో బాధపడేవారు ఉప్పును ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది జిడ్డు చర్మాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ఇతర ఆహారాలకు దూరంగా ఉండండి.
వేయించిన ఆహారాలు
సాధ్యమైనంత వరకు నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను కూడా తినకూడదు. వీటివల్ల మొటిమలు పెరిగిపోతాయి.
ఆల్కహాల్
అతిగా ఆల్కహాల్ తాగడం వల్ల ఒక్క ఆరోగ్యంపైనే కాదు.. చర్మానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ బాడీలో నీటి కంటెంట్ ను తగ్గిస్తుంది. దీంతో మీ చర్మ నిర్జీవంగా మారుతుంది. మొటిమలయ్యే అవకాశం కూడా పెరుగుతుంది
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు తప్పకుండా తినాల్సినవి..
దోసకాయలు, అరటిపండ్లు, అవకాడోలు, బచ్చలికూర, నారింజ, కరివేపాకు, గింజలు, డార్క్ చాక్లెట్ మొదలైనవి తినడం వల్ల ఆయిలీ స్కిన్ నుంచి ఉపశమనం పొందుతారు. ఇవి చర్మం నుంచి అదనపు ఆయిల్ ఉత్పత్తి కాకుండా చూస్తాయి.