ఈ ఆయుర్వేద చిట్కాలతో మీరెంత అందంగా మారిపోతారో..!

First Published Feb 6, 2023, 4:56 PM IST

చర్మంపై సహజ మెరుపును కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆరోగ్యం చేయడానికి కూడా సహాయపడతాయి. 
 

కొంతమంది చర్మం ఎప్పుడూ డల్ గా ఉంటుంది. అంతేకాదు మొటిమలు, నల్లని మచ్చలు కూడా ఎక్కువగా అవుతుంటాయి. ఈ సమస్యలను పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ట్రై చేస్తుంటారు. దీనివల్ల అప్పటి మందం ఈ సమస్యలు తగ్గిపోయినా.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వస్తుంటాయి. అయితే ఈ సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేద చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

skin care

తగినంత హైడ్రేట్ గా ఉండండి

మీ శరీరం మాదిరిగానే మీ చర్మానికి కూడా ఆర్ద్రీకరణ చాలా అవసరం. మీకు తెలుసా చాలా వరకు చర్మ సమస్యలు డీహైడ్రేషన్ వల్లే వస్తుంటాయి. కాబట్టి రోజంతా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచడానికి ప్రయత్నించండి. ఇందుకోసం రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగండి. అలాగే కీరదోసకాయ, నారింజ వంటి హైడ్రేటెడ్ ఫుడ్స్ ను తీసుకోండి. 

skin care

ఎక్కువ చక్కెర, సుగంధ ద్రవ్యాలను నివారించండి

చక్కెర, మసాలా దినుసులు కూడా మీ చర్మ సమస్యలను కలిగిస్తాయి. ఎందుకంటే దీనిలో ఉండే ఆమ్ల మూలకాలు చర్మంలో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతాయి. దీని వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. చక్కెర తీసుకోవడం వల్ల మీ చర్మంలో కొల్లాజెన్ తగ్గుతుంది. దీంతో ముడతలు, డ్రై నెస్, డల్ నెస్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తీపి పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల మొటిమలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి.
 

Image: freepik.com

తగినంత నిద్ర పొందడం

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కంటినిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో సమయానికి నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మంచిదని భావిస్తారు. వెబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. కంటి నిండా నిద్రపోవడం వల్ల మీ చర్మ సహజ మెరుపు మెరుగుపడుతుంది. అంతేకాదు ముడతలు, కళ్లు ఉబ్బడం వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 


ఫేస్ యోగా

ప్రతిరోజూ ఉదయం 20 నుంచి 25 నిమిషాలు ఫేషియల్ యోగా చేయడం వల్ల మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముడతలు, సన్నని గీతలను తొలగిస్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పబ్మెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం.. ముఖ కండరాలను సడలించడం ద్వారా.. ఫేస్ స్ట్రెచర్ ను మెరుగ్గా నిర్వహించడానికి ముఖ యోగా సహాయపడుతుంది.
 

హోం రెమెడీస్ వాడటం

ఆయుర్వేదం ప్రకారం.. శెనగపిండి, ముల్తానీ మిట్టి, గంధం పొడి వంటివి ఫేస్ వాష్ కు మంచివిగా భావిస్తారు. అలాగే కొబ్బరినూనె, అలోవెర జెల్, బాదం నూనె కలిపి ఫేస్ మసాజ్ చేసుకోవచ్చు. 
 

click me!