కీళ్ల నొప్పి, వాపు తో బాధపడుతున్నారా? తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Feb 06, 2023, 01:51 PM IST

కొన్ని మూలికలను మీ రోజు వారి  ఆహారంలో చేర్చడం వల్ల కీళ్ల నొప్పులు, మంట ఇట్టే తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..   

PREV
17
కీళ్ల నొప్పి, వాపు తో బాధపడుతున్నారా? తగ్గాలంటే ఇలా చేయండి..

మూలికలను ఎన్నో ఏండ్ల నుంచి సాంప్రదాయ చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పండ్లు, కూరగాయలు, కాయలు, విత్తనాల్లో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మూలికలలోని పోషకాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.  నిజానికి మూలికలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే కణితులను నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 

27
Arthritis

భారత దేశంలో 180 మిలియన్లకు పైగా ప్రజలు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండు రుమటాయిడ్  ఆర్థరైటిస్. ఈ సమస్యల వల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తాయి. 

ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, వాపుతో జీవించడం చాలా కష్టం. వీటివల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహారాలు కీళ్ల నొప్పులను, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

37

కలబంద

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. కలబందలో ఆర్థరైటిస్ ను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడే ఆంత్రాక్వినోన్ లు కలబందలో పుష్కలంగా ఉంటాయి. 
 

47

పసుపు

పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. పసుపును కూరల్లో, వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ మసాలాను తీసుకోవడం వల్ల మంట తగ్గుతుంది. దీనిలో ఉండే కర్కుమిన్ ఔషద లక్షణాలను కలిగి ఉంటుంది. మీకు ఆర్థరైటిస్, గౌట్ లేదా కండరాల నొప్పి ఉండే మీ భోజనంలో ఖచ్చితంగా పసుపును జోడించండి.
 

57

థైమ్

ఈ హెర్బ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. రుచిని పెంచడానికి చెకెన్, గొడ్డు మాంసం లేదా కూరగాయలకు దీన్ని జోడిస్తారు. ఈ థైమ్ మసాలాగా కూడా పనిచేస్తుంది. 
 

67

అల్లం

అల్లం ల్యూకోట్రియెన్స్ అని పిలిచే తాపజనక అణువులను అణిచివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నొప్పి, మంటకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్లను సంశ్లేషణ చేస్తుంది. అల్లం టీని తాగినప్పటికీ.. వంటలను టేస్టీగా చేయడానికి అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లాన్ని సలాడ్లలో గార్నిష్ గా కూడా ఉపయోగిస్తారు. 
 

77

వెల్లుల్లి

అల్లం మాదిరిగానే వెల్లుల్లిని కూడా రోజువారి వంటలలో కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో డయాలిల్ డైసల్పైడ్ ఉంటుంది. దీనిలో ఉండే శోథ నిరోధక సమ్మేళనం ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల ప్రభావాలను తగ్గిస్తుంది.  
 

Read more Photos on
click me!

Recommended Stories