ద్రాక్షలో పొటాషియం, సోడియం, జింక్, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి 9 వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షలో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే ఇది మీ రక్త నాళాలకు ఎలాంటి హాని చేయదు. నిజానికి ద్రాక్షలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.