
1950 న భారత రాజ్యంగం అమలులోకి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజుకు గుర్తుగా జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది మనం 74 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం గర్వించదగ్గ ఈ రోజును భాతరదేశం అంతటా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి భారతరాష్ట్రపతి, ప్రభుత్వ అధికారులు, పలువురు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు.
గణతంత్రం రోజున ప్రజలు భారత దేశ చరిత్రను, స్వాతంత్ర్య పోరాటాన్ని స్మరించుకుంటారు. మీరు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా. అయితే రిపబ్లిక్ డే సందేశాలు, కోట్స్, స్టేటస్, శుభాకాంక్షలు మీ కోసం..
మనందరిదీ ఒకే దేశం కాబట్టి.. ఎల్లప్పుడూ మంచి పనులకోసమే నిలబడే శక్తి ఉండాలి. బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలను రక్షించండి. సోదరభావంతోనే మంచి పెరుగుతుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన దేశంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, న్యాయం అనే స్ఫూర్తి ఎల్లప్పుడూ నెలకొనాలి. 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబించే మన రాజ్యాంగ సూత్రాలకు మనం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి. 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యం ఎంతో ఖరీదైనది. వెలకట్టలేనిది. కాబట్టి దానిని తేలికగా తీసుకోకండి. హ్యాపీ రిపబ్లిక్ డే 2023!
ధైర్యవంతుల స్వాతంత్ర్య పోరాటాన్ని ఎప్పటికీ మరచిపోలేం. హ్యాపీ రిపబ్లిక్ డే 2023!
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాన్ని, మన జెండాను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2023!
మన దేశపు గొప్ప వారసత్వాన్ని మరువకూడదు. ఈ దేశంలో భాగమైనందుకు గర్విద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2023!
ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సామాజిక దురాచారాల నుంచి మన దేశాన్ని రక్షించడానికి మనమందరం చేతులు కలుపుదాం. హ్యాపీ రిపబ్లిక్ డే
కొందరికి ఆదివారం అంటే ఇష్టం..
మరికొందరికి సోమవారం అంటే ఇష్టం..
కానీ నాకు వన్ డే అంటే ఇష్టం..
అదే రిపబ్లిక్ డే..
2023 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
దేశ వైభవాన్ని చూసి ఆనందించండి. మన కోసం ప్రాణాలను సైతం లెక్కుచేయకుండా పనిచేస్తున్న సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. 2023 గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.
మనం భారతీయులమైనందుకు గర్విద్దాం.. ఎందుకంటే ఈ గొప్ప దేశంలో జన్మించిన వారు నిజంగా అదృష్టవంతులు.. హ్యాపీ రిపబ్లిక్ డే 2023.
భావి తరాలు ఆత్మగౌరవంతో జీవించాలని మన వీరులు వీరోచిత పోరాటం చేశారు. హ్యాపీ రిపబ్లిక్ డే!
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఎన్నటికీ మరచిపోవద్దు. వారి అడుగుజాడల్లో నడిచి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం.. హ్యాపీ రిపబ్లిక్ డే!
స్వాతంత్ర్యం అంత సులువుగా రాలేదు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. మన స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే!
మన ధైర్యవంతులైన స్వాతంత్ర్య సమరయోధుల కృషి వృథా కానివ్వబోమని ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ మహిమాన్వితమైన రోజును భారతదేశానికి తీసుకురావడానికి తమ జీవితాలను త్యాగం చేసిన హీరోలను ఎప్పటికీ మరచిపోవద్దు. హ్యాపీ రిపబ్లిక్ డే.
నా దేశం పట్ల నా ప్రేమకు హద్దుల్లేవు. నా ప్రజలపై నా ప్రేమ అంతులేనిది. నా దేశం కోసం నేను కోరుకునేది ఆనందం మాత్రమే. హ్యాపీ రిపబ్లిక్ డే
జాతిపిత మహాత్మాగాంధీ 'ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పుగా ఉండండి' అని చెప్పిన ఆ మాటలు నేటికీ వర్తిస్తాయి. నాయకుడిగా ఉండండి. మంచి మార్పుకు పునాదులు వేయండి. మీకు 2023 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.