Fridge Hack: ఫ్రిజ్ లో పెట్టినా కూరగాయలు పాడౌతున్నాయా? ఇదొక్కటి పెడితే 10రోజులైనా తాజాగా ఉంటాయి

Published : May 12, 2026, 03:35 PM IST

Fridge Hack: ఈ ఎండాకాలంలో  ఫ్రిజ్ లో ఉంచినా కూడా కూరగాయలు చాలా తొందరగా పాడైపోతున్నాయా? అయితే.. కేవలం ఐదు రూపాయల ఖర్చుతో  మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.  పది రోజులైనా కూరగాయలు తాజాగా ఉంటాయి..   

PREV
14
కూరగాయలు ఎందుకు పాడౌతాయి...?

ఎండ వేడికి కూరగయాలు పాడవ్వడం చాలా సహజం. కానీ.. ఫ్రిజ్ లో కూడా కూరగాయలు ఎందుకు పాడౌతాయి..? ఫ్రిజ్ లో టెంపరేచర్ తక్కువగా ఉంటే… అవి తాజాగా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ.. ఫ్రిజ్ లోపల.. ముఖ్యంగా వెజిటేబుల్ బాక్స్ లో తేమ ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ అధిక తేమ వల్లే బాక్టీరియా, బూజు త్వరగా పెరిగి.. ఆకుకూరలు వాడిపోయేలా లేదా జిగురుగా మారతాయి.

24
స్పాంజ్ చేసే మ్యాజిక్...

అయితే, ఒకే ఒక సింపుల్ చిట్కాతో  మనం కూరగాయలు పది రోజులైనా తాజాగా ఉండేలా మార్చుకోవచ్చు. దాని కోసం మన దగ్గర ఒక స్పాంజ్ ఉంటే చాలు.  సాధారణంగా గిన్నెలు శుభ్రం చేసే స్పాంజ్ లు అందరు ఇళ్లల్లో ఉంటూనే ఉంటాయి. అలాంటి స్పాంజ్ కి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. దీనిని వెజిటేబుల్ బాక్స్ లో పెట్టినప్పుడు.. అందులోని అధిక తేమను స్పాంజ్ పీల్చుకుంటుంది.ఇలా చేయడం వల్ల, కూరగాయల చుట్టూ వాతావరణం పొడిగా మారుతుంది.. దీని వల్ల కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

అంతేకాదు.. ఫ్రిజ్ లో మనం రకరకాల ఆహార పదార్థాలను పెడుతూ ఉంటాం.  వీటి కారణంగా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ స్పాంజ్ పెట్టడం వల్ల, ఆ దర్వాసన మొత్తాన్ని స్పాంజ్ పీల్చుకుంటుంది. దీని వల్ల ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాదు.

34
ఎలా వాడాలి..?

ముందుగా ఒక కొత్త, పొడి స్పాంజ్ తీసుకోండి.  దాన్ని వెజిటబుల్ డ్రాయర్ మూలలో లేదా పక్కన పెట్టండి.  ఒకవేళ ఫ్రిడ్జ్‌లో తేమ మరీ ఎక్కువగా ఉంటే, రెండు స్పాంజ్‌లను కూడా వాడొచ్చు.  స్పాంజ్‌ను నేరుగా కూరగాయల మీద పెట్టకూడదు. పక్కన మాత్రమే ఉంచాలి.

44
ఏ కూరగాయలకు ఇది బెస్ట్?
పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలతో పాటు స్ట్రాబెర్రీలు, దోసకాయలు, క్యారెట్లు, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ఈ టిప్ ద్వారా ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. ఖరీదైన కంటైనర్లు లేదా ప్రత్యేకమైన బ్యాగులు కొనాల్సిన అవసరం లేకుండా కేవలం ఐదు రూపాయల స్పాంజ్‌తో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories