ఫ్యాన్ తో ఇంటిని చల్లగా మార్చవచ్చు...
సీలింగ్ ఫ్యాన్లు యాంటీ క్లాక్ వైస్ లో తిరిగినప్పుడు చల్లటి గాలి వస్తుంది. దీని వల్ల ఫ్యాన్ కింద కూడా మీకు చల్లగా అనిపిస్తుంది…
ఐస్ టెక్నిక్.. టేబుల్ ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ క్యూబులు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి.. ఐస్ ముక్కలకు తగిలి… గాలి చల్లగా వస్తుంది.
వేడి గాలి బయటకు పంపడం… ఇంట్లోని వేడి గాలి బయటకు పంపినప్పుడు ఇల్లంతా చల్లగా ఉంటుంది. దీని కోసం మీరు మీ ఇంట్లో కిచెన్, బాత్రూమ్ లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడాలి.
కరెంట్ వాడకం తగ్గించడం…టీవీ, ల్యాప్‌టాప్, పాత బల్బులు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. అవసరం లేనప్పుడు వాటిని ఆపేయండి. పాత బల్బుల స్థానంలో తక్కువ వేడినిచ్చే LED లైట్లను వాడండి. మధ్యాహ్నం పూట ఎక్కువ వేడిని పుట్టించే ఓవెన్ వాడకాన్ని, వంటను తగ్గించడం మంచిది.
ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల లోపే కిటికీలు మూసేయండి. ముదురు రంగు కర్టెన్లు వేడిని పీల్చుకుంటాయి, అందుకే లేత రంగు కర్టెన్లనే వాడండి. 'బ్లాక్-అవుట్' కర్టెన్లు లేదా హీట్-రిఫ్లెక్టింగ్ ఫిల్మ్‌లు వాడితే కిటికీల నుంచి వచ్చే వేడి చాలా వరకు తగ్గుతుంది.