Simple Muggulu: వాకిట్లో నిండుగా మెలికల ముగ్గులు, ఇవిగో సింపుల్ రంగోలీ

Published : Dec 17, 2025, 10:54 AM IST

Simple Muggulu: ధనుర్మాసం వచ్చిందటే ఇంటి ముందు ముగ్గు ఉండాల్సిందే. వాకిట్లో నిండుగు ఉండే ముగ్గు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని అంటారు. ఇక్కడ మేము సింపుల్ గా వేసుకునే మెలిక ముగ్గులను ఇచ్చాము. ఓసారి ప్రయత్నించండి.

PREV
15
మెలికల ముగ్గులు

హిందూ సంప్రదాయాల్లో ముగ్గులకు ఎంతో చరిత్ర ఉంది. అందులో మెలికల ముగ్గులు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేవి ఈ మెలికల ముగ్గులే. ధనుర్మాసం మొదలైందంటే చాలు కచ్చితంగా ప్రతి ఇంటి ముందు ముగ్గు కనిపిస్తుంది. ఇక్కడ మేము సింపుల్ ముగ్గులను అందించాము. ఇవన్నీ చాలా సులువుగా వేసేయవచ్చు. ఇక్కడిచ్చిన ముగ్గును చూసి మీరు చాలా సులువుగా నేర్చుకుని వేయవచ్చు.

25
గంధపు గిన్నెల ముగ్గులు

మెలికల ముగ్గుల్లో ఇవి ఒకరకమైనవి. వీటిని గంధపు గిన్నెల ముగ్గులు అని పిలుస్తారు. చూడటానికి వీటి ఆకారం గంధపు గిన్నెల్లాగా కనిపిస్తాయి. అందుకే వీటిని అలా పిలుస్తారు.

35
అంచు ముగ్గులు

అంచు ముగ్గులు అంటే.. ముగ్గు పూర్తయ్యాక నాలుగు వైపులా వేసే డిజైన్లను అంచు ముగ్గులు అని పిలుస్తారు. ఇక్కడ నాలుగు రకాల ముగ్గులను అందించాము. ఇవి చూసేందుకు ఎంతో నిండుగా ఉంటాయి.

45
ఇంటి ముందు నిండుగా

మెలికల ముగ్గుల్లో ఈ చుక్కల ముగ్గులు చాలా అందంగా ఉంటాయి. వీటికి రంగులు వేసుకున్నా నిండుగా కనిపిస్తాయి.  ఇక్కడిచ్చిన ముగ్గును మీరు సులువుగా వేయచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

55
బిగినర్స్ కోసం

ఈ ముగ్గు చాలా చిన్నది. బిగినర్స్ కూడ దీన్ని చాలా సులువుగా వేసేయవచ్చు. ఏడు చుక్కలు ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు పెట్టుకుని అప్పుడు ఈ ముగ్గును వేయాలి. ఇంకెందుకాలస్యం ప్రయత్నించి చూడండి.

Read more Photos on
click me!

Recommended Stories